అన్వేషించండి

Ravi Mohan: కన్నీళ్లు, కష్ట సమయంలో నాకు సపోర్ట్‌గా నిలిచింది - సింగర్ కెనీషాపై జయం రవి సుదీర్ఘ పోస్ట్

Jayam Ravi: కోలీవుడ్ స్టార్ జయం రవి, సింగర్ కెనీషాపై ఇటీవల రూమర్స్ హల్చల్ చేస్తోన్న వేళ తాజాగా ఆయన ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. కష్ట సమయంలో తనకు ఎంతో అండగా నిలిచారని అన్నారు.

Jayam Ravi Long Post On Singer Kenishaa: కోలీవుడ్ స్టార్ జయం రవి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తి రవితో విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది ఆయన ప్రకటించారు. ఇటీవల సింగర్ కెనీషాతో రవి మోహన్ ఓ పెళ్లి వేడుకలో కనిపించగా.. మళ్లీ వీరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

కష్ట సమయంలో కెనీషా సపోర్ట్

తాజాగా.. జయం రవి (Jayam Ravi) ఇన్ స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కెనీషా (Kenishaa) ఎంతో మంచి వ్యక్తి అని.. ఆమెకు తగిన గౌరవ, మర్యాదలు దక్కాలని అన్నారు. తన మౌనం బలహీనత కాదని.. తన గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన జర్నీ.. తాను ఎదుర్కొన్న కష్టాల గురించి తెలియని వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాను పెదవి విప్పక తప్పదంటూ 4 పేజీల సుదీర్ఘ లేఖను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

'వేధింపుల నుంచి కోలుకున్నా'

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న టైంలోనూ తన వ్యక్తిగత జీవితంపైనే కొందరు దృష్టి సారించడం బాధగా ఉందని జయం రవి అన్నారు. 'హార్డ్ వర్క్‌తో నా కెరీర్ నిర్మించుకున్నా. వ్యక్తిగత లాభం, చౌకబారు సానుభూతి కోసం నా గత వివాహ బంధాన్ని వాడుకోను. మానసిక, ఎమోషనల్, ఆర్థికపరమైన వేధింపుల నుంచి కోలుకున్నా. ఇన్నేళ్లుగా నా పేరెంట్స్‌ను కలవలేకపోయాను. వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవాలని ఎంతో ప్రయత్నించా. ఎంతో ఆలోచించి ధైర్యం చేసి ఆ లైఫ్ నుంచి బయటకు వచ్చా. విడాకుల నిర్ణయంపై ఇప్పటికే కుటుంబసభ్యులు, అభిమానులతో మాట్లాడా.

ఈ విషయంలో మౌనం కూడా తప్పేనని అర్థమైంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఎన్నో అసత్య ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఆయా వదంతులను పూర్తిగా ఖండిస్తున్నా. ప్రజల సానుభూతి, ఆర్థిక లాభం కోసం నా పిల్లలను ఓ సాధనంగా వాడుకోవడం చూస్తుంటే బాధగా ఉంది. నా పిల్లల క్షేమం కోసం నేను ఎప్పుడూ దేవున్ని ప్రార్థిస్తాను. ఎన్నో క్లిష్ట పరిస్థితుల తర్వాత ఆర్తి నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నా. నా పిల్లలను వదిలేయాలని ఎప్పుడూ అనుకోలేదు.' అని పేర్కొన్నారు.

కన్నీళ్లు, బాధ టైంలో అండగా నిలిచారు

స్నేహితులుగానే కెనీషాకు తనకు పరిచయం మొదలైనట్లు జయం రవి తెలిపారు. 'జీవితంలో నిరాళ, కన్నీళ్లు, బాధ మిగిలిన సమయంలో కెనీషా నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. కట్టుబట్టలతో ఓ రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సమయంలో ఆమెనే నాకు అండగా ఉన్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె వెనుకాడలేదు. ఆమె గురించి, ఆమె వృత్తి గురించి ఎలాంటి అమర్యాదకరమైన ప్రచారాన్ని అనుమతించాలనుకోవడం లేదు.' అంటూ పోస్ట్‌లో జయం రవి పేర్కొన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravi Mohan (@iam_ravimohan)

Also Read: డైరెక్టర్ రాజ్‌తో కలిసి సమంత ఫోటో - దర్శకుడి సతీమణి పోస్ట్ వైరల్

ఇదీ జరిగింది

అయితే, ఇటీవల ఓ పెళ్లి వేడుకలో సింగర్ కెనీషా, జయం రవి కలిసి కనిపించగా.. ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఆయన భార్య ఆర్తి రవి.. తనను ఇంటి నుంచి గెంటేశారని, పిల్లలను పట్టించుకోరని ఆరోపిస్తూ పోస్ట్ పెట్టారు. తమ విడాకుల ప్రాసెస్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. దీనికి సింగర్ కెనీషా సైతం కౌంటర్ ఇచ్చారు. 'ఓ మగాడు ఎప్పుడూ ఎమోషన్స్‌కు లొంగడు. ఏ మహిళ దగ్గర అయితే ప్రశాంతత ఉంటుందో వాళ్లకే తన హృదయాన్ని ఇస్తాడు. సైలెంట్‌గా ఉన్నాను కదా అని లైట్ తీసుకోకు.' అంటూ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలోనే జయం రవి తాజాగా స్పందించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget