Junior Release Date: గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు సినిమా... శ్రీలీలతో కిరీటి రెడ్డి 'జూనియర్'... రిలీజ్ డేట్ కన్ఫర్మ్
Junior Movie Release Date: కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'జూనియర్'. ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది.

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఇంట జరిగిన పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఆయన వ్యాపార సామ్రాజ్యం మీద వివాదాలు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెడితే... గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి రెడ్డి (Gali Kireeti Reddy) కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఆ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది.
జూలై 18న కిరీటి రెడ్డి 'జూనియర్' విడుదల
గాలి కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'జూనియర్' (Junior Movie). ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం మీద రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రమిది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 18న థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కిరీటి జంటగా శ్రీ లీల... జెనీలియా కూడా!
'జూనియర్' సినిమాలో కిరీటి రెడ్డి సరసన యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ రోల్ చేస్తున్నారు. 'బొమ్మరిల్లు' సినిమాతో హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన, అనేక సినిమాల్లో నటించిన హీరోయిన్ జెనీలియా. ఆవిడ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో జెనీలియా కమ్ బ్యాక్ ఫిలిం ఇది. కన్నడలో లెజెండరీ హీరో, క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర వి ఒక కీలక పాత్రలో నటించారు.
#Junior hits theatres worldwide on July 18th in Kannada, Telugu, Hindi, Tamil, and Malayalam ✨
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 15, 2025
A Rockstar @ThisIsDSP Musical 🎸💥#JuniorOnJuly18th pic.twitter.com/WKaUt0DQ6K
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్!
ప్రేమతో పాటు కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, వినోదం నేపథ్యంలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా 'జూనియర్' చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా సినిమాలకు పని చేసిన కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇండియాలో టాప్ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఈ చిత్రానికి వర్క్ చేశారు. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని మాటలు రాశారు. మరి ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో? కిరీటి రెడ్డికి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.





















