Ravi Babu: మహిళలపై తండ్రి చలపతి రావు అసభ్యకర వ్యాఖ్యలు - ఇన్నాళ్లకు స్పందించిన రవిబాబు
Ravi Babu: సీనియర్ యాక్టర్ చలపతి రావు ఒక ఆడియో ఫంక్షన్‌లో ఆడవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన జరిగి ఎన్నో ఏళ్లు అయినా ఆ విషయంపై ఇన్నాళ్లకు స్పందించడానికి ముందుకొచ్చారు ఆయన కుమారుడు రవిబాబు.
Ravi Babu About Chalapathi Rao Comments On Women: సీనియర్ నటుడు అయిన చలపతి రావు ఎన్నో ఏళ్లు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరించారు. ఆయనంటే చాలామందికి అభిమానం కూడా. కానీ ఒక ఆడియో లాంచ్ ఈవెంట్‌లో అందరి ముందు ఆడవారి గురించి తప్పుగా మాట్లాడారు చలపతి రావు. కాసేపటిలోనే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన కావాలని ఆ వ్యాఖ్యలు చేసినా చేయకపోయినా అలా మాట్లాడడం చాలా తప్పు అంటూ ఆయనపై చాలా నెగిటివిటీ ఏర్పడింది. అంతే కాకుండా దానివల్ల ఆయనపై కేసు కూడా ఫైల్ అయ్యింది. ఇక ఆ ఘటనపై చలపతి రావు కుమారుడు రవిబాబు తాజాగా స్పందించారు.
చివరికి క్షమాపణలు..
నాగచైతన్య హీరోగా నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీలో చలపతి రావు కూడా ఒక కీలక పాత్ర పోషించారు. ఇక ఆ మూవీ ఆడియో లాంచ్‌లో ‘‘ఆడవారు దానికి మాత్రమే పనికొస్తారు’’ అంటూ అసభ్యకరంగా మాట్లాడారు చలపతి రావు. దీంతో మహిళా సంఘాలు ఆయనపై కేసు కూడా ఫైల్ చేయడానికి సిద్ధమయ్యారు. అప్పట్లో ఈ విషయం టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆయన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్తేనే కేసు వెనక్కి తీసుకుంటామని మహిళా సంఘాలు సైతం చట్టపరమైన చర్యలకు సిద్ధమని స్టేట్‌మెంట్ ఇచ్చాయి. దీంతో తప్పు ఆయనదే అని ఒప్పుకొని, మహిళలకు క్షమాపణ చెప్పారు చలపతి రావు. ఈ ఘటనపై రవిబాబు తాజాగా స్పందించారు.
అందరూ చేసేదే..
‘‘ఇప్పటివరకు మా నాన్న చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించలేదు. మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పడమే కరెక్ట్ అని నేను కూడా మా నాన్నతో చెప్పాను. క్షమాపణ చెప్పడం ఆయన బాధ్యత అనుకొని ఈ విషయంలో నేను జోక్యం చేసుకోలేదు. తొందరపాటుతనంతో, అనుకోకుండా అనే మాటల వల్ల అందరం ఏదో ఒక సందర్భంలో అవతలి మనిషిని హర్ట్ చేసే ఉంటాం. కానీ ఆ తప్పును తెలుసుకొని క్షమాపణ చెప్పడం ముఖ్యం. మీడియా అంతా ఉన్నప్పుడు మా నాన్న అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన దురదృష్టం. తర్వాత ఆయన పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పి దానికి ముగింపు పలికారు’’ అని చెప్పారు రవిబాబు.
దర్శకుడిగా ప్రయత్నాలు..
చలపతి రావు మంచి నటుడే అయినా తన వారసుడు రవిబాబు మాత్రం తనలాగా నటన మాత్రమే కాకుండా డైరెక్షన్‌లో కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని కోరుకున్నారు. అందుకే నటుడిగా డెబ్యూ చేసినా కూడా డైరెక్టర్‌గా అప్పుడప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు రవిబాబు. ముఖ్యంగా అడల్ట్ కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు స్పెషలిస్ట్ అనిపించుకున్నారు. ఆ తర్వాత ‘అవును’ లాంటి హారర్ మూవీని తెరకెక్కించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. గత కొన్నేళ్లుగా డైరెక్టర్‌గా ఆయన అంతగా సక్సెస్‌ను అందుకోలేకపోయారు. 2023లో విడుదలయిన ‘అసలు’.. దర్శకుడిగా రవిబాబు చివరి చిత్రం.
Also Read: చాలామంది నా కొడుకును హీరో చేయమన్నారు - తిండి తినకుండా ఫొటోలతో ఆఫీసులు చుట్టూ తిరిగా: నటుడు సురేష్