అన్వేషించండి

Raveena Tandon: వాంతులు, గదులు తుడిచే నన్ను నటిని చేసింది ఆయనే - రవీనా టాండన్

10వ తరగతి తర్వాత ఓ స్టూడియో పారిశుధ్య పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించిన రవీనా.. తాను నటిని అవుతానని ఏ రోజూ అనుకోలేదట. ఈ విషయాన్ని ఆమే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Raveena Tandon | బాలకృష్ణ నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలోని ‘‘స్వాతిలో ముత్యమంట..’’ సాంగ్ వినగానే వెంటనే గుర్తుకొచ్చేది రవీనా టాండనే(Raveena Tandon). వాన పాటలో బాలయ్యతో స్టెప్పులేస్తూ రవీనా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలేవీ రాలేదు. ‘ఆకాశ వీధిలో’, ‘రధసారథి’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే, అప్పటికే రవీనాకు బాలీవుడ్‌లో మాంచి క్రేజ్ ఉంది. దీంతో ఆమె ఉత్తరాది చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది. తాజాగా ‘KGF’ చాప్టర్-2 చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది రవీనా. ఈ సందర్భంగా ఆమె ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తన గతాన్ని గుర్తుచేసుకుంది.

రవీనా 1991లో ‘పత్తర్ కే ఫూల్‌’ సినిమాతో అరంగేట్రం చేసింది. తర్వాత బాలీవుడ్ టాప్ హీరోయిన్ల సరసన నిలిచింది. అయితే, ఆమె ఏ రోజు నటిని అవుతానని అనుకోలేదట. నటిని కావాలనే ఆశయం కూడా ఆమెకు లేదట. అయితే, పేదరికం వల్ల 10వ తరగతి తర్వాత చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేందట. ఈ సందర్భంగా ఆమె యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రహ్లాద్ కక్కర్ స్టూడియోలో పనులు చేసేదట. 

‘‘అప్పట్లో నేను స్టూడియో ఫ్లోర్‌లను శుభ్రం చేయడం నుంచి స్టాల్స్ ఫ్లోర్‌లు, వాంతిని తుడిచివేయడం వరకు అన్ని పనులు చేసేదాన్ని. ప్రహ్లాద్ కక్కర్‌కి సాయం చేస్తుండేదాన్ని. ఆ సమయంలో ఆయన నువ్వు తెర వెనుక ఏం చేస్తున్నావు? నువ్వు స్క్రీన్ ముందు ఉండాలి అనేవారు. అందుకు నేను ‘నేనా? నటినా? సాధ్యమే కాదు’ అనేదాన్ని. కాబట్టి నేను అనుకోకుండా ఈ పరిశ్రమలో ఉన్నానని ఇప్పటికీ అనుకుంటాను. నేను నటిని అవుతానని ఏ రోజూ ఆలోచించలేదు’’ అని తెలిపింది. 

Also Read: 'నా పొటెన్షియల్ ఏంటో తెలిసేలా చేసింది' - 'కేజీఎఫ్2' సినిమాపై సంజయ్ దత్ కామెంట్స్

అలా మొదలైంది..: రవీనా టాండన్‌ను ఓ యాక్సిడెంటల్ మోడల్ అని చెప్పుకోవాలి. ప్రహ్లాద్ కక్కర్ స్టూడియోలో షూట్‌లకు వచ్చే మోడల్‌లు విఫలమైనప్పుడు.. అతడు వారి స్థానంలో రవీనా టాండన్‌ను మోడలింగ్ చేయాలని కోరేవాడు. దీంతో ఆమె మొదట్లో ఉచితంగానే అతడికి మోడలింగ్ చేస్తూ సాయం చేసేది. ఆ తర్వాత డబ్బు సాంపాదనకు మోడలింగ్ ఉపయోగపడుతుందనే భావనతో అదే కొనసాగించింది. ఆమె ప్రకటన వీడియోలు చూసి.. బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం మొదలైంది. అలా ఆమె సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంది. తాజాగా ‘కేజీఎఫ్-చాప్టర్ 2’లో కనిపించి మరోసారి తన ప్రతిభను చాటింది. ఈ చిత్రం తర్వాత ఆమె మరోసారి ‘ఘుడచాడి’ సినిమాతో సంజయ దత్‌తో స్క్రీన్ పంచుకోబోతోంది. 

Also Read: తల్లి కాబోతున్న సునీత? ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget