News
News
వీడియోలు ఆటలు
X

Ravanasura: రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, ఓటీటీలోకి 'రావణాసుర' - డేట్ ఫిక్స్!

సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ అండ్ థ్రిల్లర్ 'రావణాసుర' ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ మూవీ మే 5నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Ravanasura : 'ధమాకా' బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం 'రావణాసుర'.  సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజైంది. ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్లుగా ఈ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజైనా.. ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మే 5, 2023న OTT ప్లాట్‌ఫారమ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మాస్ హీరో రవితేజ నటించిన 'రావణాసుర' సరికొత్త వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, టీజర్.. భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. రన్-ఆఫ్-ది-మిల్ కమర్షియల్ డ్రామాగా ప్రారంభమై, కాసేపటికి థ్రిల్లర్‌ గా మారే ఈ స్టోరీ నేపథ్యం ఆద్యంతం ఆసక్తిగా సాగినా.. చివరికి మాత్రం ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ ప్రేక్షకులకు మరింత చిరాకును తెప్పిస్తాయి. కాస్త ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామనుకునే లోపే మళ్లీ.. స్టోరీ దారి తప్పినట్టనిపిస్తుంది. మధ్యలో వచ్చే మ్యూజిక్, పాటలు కొన్ని సార్లు చాలా అడ్డంకిగా, బలవంతంగా స్టోరీలోకి నెట్టబడినట్టు అనిపిస్తాయి. ఇన్ని నెగెటివ్ కామెంట్స్ మధ్య 'రావణాసుర' మూవీ రవితేజ ఫ్యాన్స్ కు అత్యంత నిరాశకు గురి చేసింది. ‘ధమాకా’ భారీ సక్సెస్ ఇస్తాడనుకున్న అభిమానులకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఓ మోస్తరు రేంజ్ లో మాత్రమే మార్కులు పడ్డాయి.

మొన్నటివరకూ థియేటర్లలో ఆడిన 'రావణాసుర' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో చూడని కొంతమంది ఓటీటీలో చూడొచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ గత కొన్ని రోజుల క్రితమే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 'రావణాసుర'ను మే 5 నుంచి ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సమాచారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

 యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసురను' అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ కలిసి నిర్మించాయి.ఈ మూవీలో హీరో రవితేజతో పాటు అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, శ్రీరామ్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

గతేడాది 'క్రాక్', 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' లాంటి సినిమాలతో అలరించిన మాస్ రాజా... ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, రావణాసుర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావుతో పాటు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ‘కలర్ ఫొటో’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రాజ్‌తో రవితేజ కొత్త సినిమాతో జట్టు కట్టనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also: అలా మెరిసి, ఇలా మాయమయ్యారు - తొలి సినిమాతో మనసుదోచి కనుమరుగైన హీరోయిన్లు వీళ్లే

Published at : 26 Apr 2023 01:29 PM (IST) Tags: raviteja Amazon Prime Video OTT Release Ravanasura Sudheer Varma

సంబంధిత కథనాలు

Karate kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

Karate kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?