Rashmika Mandanna: ప్రధాని మోదీ మీద రష్మిక ప్రశంసల జల్లు - దేశం ఇలా మారుతుందని అసలు ఊహించలేదట
Rashmika Mandanna: ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీ అయిపోయింది రష్మిక మందనా. తాజాగా తను పాల్గొన్న ఇంటర్వ్యూలో దేశం గురించి, అభివృద్ధి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Rashmika Mandanna About India Development: దేశంలో పొలిటికల్ హీట్ పెరుగుతున్న సమయంలో చాలామంది స్టార్ హీరోలు.. రాజకీయాలపై తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు. అయితే ఈ విషయంలో హీరోయిన్స్ మాత్రం అంత యాక్టివ్‌గా లేరు. తాము ఎవరికి సపోర్ట్ చేస్తున్నామనే విషయాన్ని బయటపెట్టడానికి హీరోయిన్స్ ఎక్కువగా ఇష్టపడడం లేదు. కానీ తాజాగా ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా మారిన రష్మిక మందనా మాత్రం తన ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరో ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసింది. అంతే కాకుండా ఆయన వల్ల దేశం చాలా అభివృద్ధి చెందిందంటూ ప్రశంసలు కురిపించింది. ఆయన మరెవరో కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ప్రయాణాలు ఈజీ అయిపోయాయి..
2024 జనవరిలో ముంబాయ్‌లో అటల్ సేతు అనే అతిపెద్ద సముద్ర వంతెనను ప్రారంభించారు నరేంద్ర మోదీ. దాని వల్ల ప్రయాణికులకు చాలా మేలు జరిగింది. దానిపై రష్మిక మందనా కూడా తాజాగా ఇంటర్వ్యూలో స్పందించింది. ‘‘రెండు గంటల ప్రయాణం 20 నిమిషాల్లో జరిగిపోతుంది. అంటే ఇలా జరుగుతుందని అసలు నమ్మలేరు. ఇలాంటిది ఒకటి జరుగుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. నేవి ముంబాయ్ నుండి ముంబాయ్ వరకు, బెంగుళూరు నుండి ముంబాయ్ వరకు, గోవా నుండి ముంబాయ్ వరకు ప్రయాణాలు చాలా సులువుగా మారిపోయాయి. అది కూడా మంచి సదుపాయాలతో పాటు. ఇది నన్ను చాలా గర్వపడేలా చేస్తోంది’’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది రష్మిక మందనా.
స్మార్ట్ దేశం..
‘‘ప్రస్తుతం ఇండియా ఎక్కడా ఆగడం లేదని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి దేశ అభివృద్ధి చూడండి. 10 ఏళ్లలో దేశం విపరీతంగా అభివృద్ధి చెందింది. మౌలిక సదుపాయాలు, దేశ రూపురేఖలు, రోడ్ల ప్లానింగ్, అన్ని చాలా అద్భుతంగా మారిపోయాయి. ఇప్పుడు మన టైమ్ నడుస్తోంది. 20 కిలోమీటర్ల వంతెన ఏడేళ్లలో కట్టేశారని నేను విన్నాను. నాకు చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇండియా ఒక స్మార్ట్ దేశం అని మాత్రం చెప్పగలను’’ అని దేశ అభివృద్ధి గురించి వ్యాఖ్యలు చేసింది రష్మిక. ఇప్పటివరకు ఎక్కువగా టాప్ హీరోయిన్లు ఎవరు దేశ అభివృద్ధి గురించి, అటల్ సేతు గురించి ఈ రేంజ్‌లో మాట్లాడలేదని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
ప్రభావితం అవ్వడం లేదు..
యంగ్ ఇండియాపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది రష్మిక. ‘‘యంగ్ ఇండియా అనేది చాలా స్పీడ్‌గా పెరిగిపోతోంది. యూత్ అంతా చాలా బాధ్యతతో ఉంటున్నారు. ఎవరి వల్ల కూడా వాళ్లు ప్రభావితం అవ్వడం లేదు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు’’ అని వ్యాఖ్యలు చేసింది రష్మిక మందనా. ప్రస్తుతం టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువగా సమయాన్ని గడిపేస్తోంది ఈ కన్నడ బ్యూటీ. ‘యానిమల్’ తర్వాత బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు కొట్టేసింది రష్మిక. అందుకే ఈమధ్య తను ఎక్కువగా ముంబాయ్‌లోనే సమయాన్ని గడుపుతోంది. తనకు ముంబాయ్ అభివృద్ధి చెందుతున్న తీరు నచ్చడంతో రష్మిక ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Also Read: ‘హీరామండి’ నటి షర్మిన్ నటనపై ట్రోల్స్ - ఆమె భన్సాలీ మేనకోడలట, ఆస్తులు రూ.58,000 కోట్లు!