అన్వేషించండి

Sharmin Segal: ‘హీరామండి’ నటి షర్మిన్‌ నటనపై ట్రోల్స్ - ఆమె భన్సాలీ మేనకోడలట, ఆస్తులు రూ.58,000 కోట్లు!

Sharmin Segal: సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’లో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. కానీ వారిలో షర్మిన్ సెగల్‌పై మాత్రమే నెగిటివిటీ వచ్చింది. దీంతో తను ఎవరో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు

Who Is Sharmin Segal: సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలయిన ఈ సిరీస్‌ను చూసిన సబ్‌స్క్రైబర్లు.. భన్సాలీపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాకుండా ఇందులో నటించిన ఆరుగురు నటీమణులు కూడా ‘హీరామండి’ హిట్‌లో కీలక పాత్రలు పోషించారు. అందులో అయిదుగురు హీరోయిన్స్ ఎవరో ప్రేక్షకులకు బాగా తెలుసు. కానీ అలామ్జేబ్‌గా నటించిన షర్మిన్ సెగల్ గురించి మాత్రం ఎక్కువమందికి తెలియదు. అసలు తను ఎవరో తెలుసుకున్న ఆడియన్స్ షాకవుతున్నారు.

విపరీతంగా నెగిటివిటీ..

‘హీరామండి’లో హీరోయిన్లుగా నటించిన ఆరుగురిలో షర్మిన్ సెగల్ నటన కాస్త తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. అదితి రావు, మనీషా కొయిరాల వంటి వారి నటనకు, షర్మిన్ నటనకు అసలు పోలికే లేదని ఫీలయ్యారు. అంతే కాకుండా మరికొందరు అయితే అసలు తనను ఈ సిరీస్‌లోకి ఎందుకు తీసుకున్నారు అని నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. ఫైనల్‌గా షర్మిన్ సెగల్ ఎవరు అని సెర్చ్ చేయగా తను సంజయ్ లీలా భన్సాలీ బంధువు అని తెలిసింది. దీంతో అందుకే తనకు ‘హీరామండి’లో అవకాశం వచ్చిందని విమర్శలు పెరిగాయి. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు పెరుగుతున్న నెగిటివిటీని చూసి ఆఖరికి కామెంట్స్ కూడా హైడ్‌లో పెట్టేసింది షర్మిన్.

భన్సాలీ కోడలు..

షర్మిన్ సెగల్.. 1995లో ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ దీపక్ సెగల్, ఫిల్మ్ ఎడిటర్ బేలా సెగల్‌కు జన్మించింది. ప్రస్తుతం షర్మిన్ తండ్రి బాలీవుడ్‌లో అతిపెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లో ఒకటైన అప్లాస్ ఎంటర్‌టైన్మెంట్‌కు కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. తన తల్లి బేలా.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘ఖామోషీ, ‘దేవదాస్’, ‘బ్లాక్’ వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. అంతే కాకుండా 2012లో విడుదలయిన ‘షిరిన్ ఫర్హాద్ కీ తో నికల్ పడీ’ మూవీని డైరెక్ట్ కూడా చేశారు. సంజయ్ లీలా భన్సాలీకి బేలా చెల్లెలు అవుతుందని తెలిసింది. అంటే షర్మిన్.. భన్సాలీకి మేనకోడలు అవుతుంది. షర్మిన్ సెగల్ తాతయ్య మోహన్ సెగల్ సైతం ఒకప్పుడు బాలీవుడ్‌లో కొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు.

వేల కోట్ల ఆస్తులు..

సంజయ్ లీలా భన్సాలీకి మాత్రమే కాదు.. షర్మిన్ సెగల్‌కు పలువురు బిజినెస్ ప్రముఖులు కూడా బంధువులే. తను బిజినెస్‌లో కోట్లు సంపాదించిన సమీర్ మెహ్తా కుమారుడు అయిన అమాన్‌ను పెళ్లి చేసుకుంది. అమన్ తండ్రి సమీర్‌తో పాటు తన సోదరుడు సుధీర్.. టోరెంట్ గ్రూప్‌ను స్థాపించారు. 2024లో జరిగిన సర్వే ప్రకారం సమీర్ మెహ్తా ఆస్తి ఏకంగా రూ.53,800 కోట్లు అని బయటపడింది. 18 ఏళ్లకే షర్మిన్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్‌లీలా’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ‘మలాల్’, ‘అతిథి భూతో భవ’లో హీరోయిన్‌గా కూడా నటించింది. ‘హీరామండి’తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

Also Read: కృష్ణ జింక కేసు, సల్మాన్‌ ఖాన్‌ స్వయంగా గుడికి వచ్చి క్షమాపణలు చెప్పాలి - బిష్ణోయ్‌ కమ్యూనిటీ డిమాండ్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Tahawwur rana: కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
Mark Shankar:  మార్క్ శంకర్ లెటెస్ట్ హెల్త్ అప్ డేట్ ఇదే - పవన్ ఎంత టెన్షన్ పడి ఉంటారో కదా !
మార్క్ శంకర్ లెటెస్ట్ హెల్త్ అప్ డేట్ ఇదే - పవన్ ఎంత టెన్షన్ పడి ఉంటారో కదా !
Police On Jagan: జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం - ఏపీ పోలీసు అధికారుల సంఘం హెచ్చరిక
Paneer From Donkey Milk: తులం బంగారం పెట్టినా గాడిద పాలతో చేసిన పన్నీర్‌ రాదట! పూర్తి వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!
తులం బంగారం పెట్టినా గాడిద పాలతో చేసిన పన్నీర్‌ రాదట! పూర్తి వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!
Embed widget