Rashmika Mandanna: ముగ్గురు స్టార్స్‌తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ - నేషనల్ క్రష్ రష్మిక అదరగొట్టిందిగా, అదే జోష్‌లో..
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్‌తో పాటు ఇప్పుడు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వరుస హ్యాట్రిక్ హిట్లతో ఓ రేంజ్‌లో దూసుకెళ్తున్నారు.

Rashmika Mandanna Consecutive Hits: రష్మిక మందన్న (Rashmika Mandanna).. తన టాలెంట్, అందం, నటన, డ్యాన్స్‌తో అటు బాలీవుడ్ సహా ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు అందుకుంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరోయిన్లను మించి క్రేజ్ సొంతం చేసుకున్నారు. తాజాగా విడుదలైన 'ఛావా' (Chhaava)తో ఆమె రేంజ్ మారిపోయింది. వరుసగా ముగ్గురు స్టార్లతో నటించి మూడు బిగ్గెస్ట్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. రణ్‌బీర్‌కపూర్ సరసన నటించిన యానిమల్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప 2, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో నటించిన 'ఛావా' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. దీంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు దక్కుతున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో ముగ్గురు పెద్ద హీరోలతో కలిసి వరుసగా 2 పెద్ద హిట్లు అందుకున్న ఏకైక హీరోయిన్‌గా రష్మిక నిలిచారు. ఈ సక్సెస్‌లు ఇలాగే కొనసాగాలంటూ ఫ్యాన్స్ ఆమెకు విషెష్ చెబుతున్నారు.
ఆ 3 సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వచ్చిన 'యానిమల్' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'లో ఆమె శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో ఆమె నటనకు యూత్ సహా ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఫిదా అయిపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
Also Read: 3 రోజులుగా ఆస్పత్రిలోనే సుడిగాలి సుధీర్ - అసలు కారణం ఏంటి.?, ధనరాజ్ ఎందుకు అంత ఎమోషన్ అయ్యారు?
ఇక, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ లేటెస్ట్ మూవీ 'ఛావా'లో రష్మిక హీరోయిన్‌గా నటించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో శంభాజీ మహరాజ్ భార్య యేసుబాయి పాత్రలో ఆమె నటించి మెప్పించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలై రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ ఈ మూవీ దాదాపు రూ.121 కోట్లు వసూలు చేసినట్లు మూవీ టీం తెలిపింది.
అప్ కమింగ్ మూవీస్‌లోనూ అదే జోష్
ఈ ఏడాది ప్రారంభంలోనే మంచి హిట్స్ అందుకున్న రష్మిక అదే జోరు కొనసాగిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వం వహిస్తోన్న 'సికిందర్' సినిమాలో సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటిస్తున్నారు. ఈ మూవీ మార్చి నెలాఖరున రిలీజ్ కానుంది. అలాగే, ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న 'కుబేర' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో విమెన్ సెంట్రిక్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్'లోనూ నటిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా సరనస 'థమా' అనే హారర్ కామెడీ మూవీలోనూ రష్మిక నటిస్తున్నారు.
Also Read: 'అమరన్' హీరో శివకార్తికేయన్ లేటెస్ట్ మూవీ - అదిరిపోయే టైటిల్ ఫిక్స్, గ్లింప్స్ చూశారా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

