Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై రష్మిక కామెంట్స్ - ఇంతకీ ఏమన్నదో తెలుసా?
Rashmika Mandanna: రష్మిక మందనా, విజయ్ దేవరకొండ లవ్‌లో ఉన్నారనే వార్తలు ఇప్పటికీ ఆగడం లేదు. ఇదే సమయంలో ఇటీవల విడుదలయిన విజయ్ దేవరకొండ మూవీ పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది రష్మిక.
Rashmika Mandanna About VD 12 Poster: రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇతర యంగ్ హీరోలలాగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఓకే చేయకుండా ఒకటి తర్వాత ఒకటిగా నెమ్మదిగా వెళ్తున్నాడు. చివరిగా తను పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ అనే మూవీలో నటించాడు. ఈ మూవీ విడుదలయ్యి చాలా రోజులు అవుతున్నా తన తరువాతి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉన్నాడు. ఫైనల్‌గా తన కెరీర్‌లో హీరోగా తెరకెక్కుతున్న 12వ సినిమాకు సంబంధించి ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ పోస్టర్‌పై రష్మిక మందనా స్పందించింది.
ట్విటర్‌లో రియాక్షన్..
ఎవరూ ఊహించని విధంగా ‘వీడీ 12’ను అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇప్పటివరకు విజయ్ ఎక్కువగా యూత్‌కు దగ్గరయ్యే పాత్రల్లోనే నటించాడు. అందులో ఒక్కటి కూడా పూర్తిస్థాయి సీరియస్ రోల్ లేదు. ఇక ‘వీడీ 12’తో తను ఒక కొత్త ప్రయోగం చేయనున్నాడని ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ ఫస్ట్ లుక్‌లో విజయ్.. చిన్న హెయిర్ కట్‌తో కనిపిస్తున్నాడు. పైగా తన మొహం మీద రక్తం ఉంది. పెద్దగా అరుస్తున్నాడు. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటేనే విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చేయని ప్రయోగం ఏదో చేస్తున్నాడని అర్థమవుతోంది. ఈ పోస్టర్ రష్మికకు కూడా నచ్చినట్టుంది. అందుకే ట్విటర్‌లో రియాక్ట్ అయ్యింది.
ఒకరికొకరు సపోర్ట్..
‘‘తన తలరాత తనకోసం ఎదురుచూస్తోంది. తప్పులు, రక్తపాతం, ప్రశ్నలు, మరో పుట్టుక’’ అంటూ ‘వీడీ 12’.. 2025 మార్చి 28న విడుదల కానుందని అనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ ఫస్ట్ లుక్‌ను షేర్ చేయడంతో పాటు ‘పిచ్చెక్కించేలా ఉంది’ (Madness) అంటూ పక్కనే ఫైర్ ఎమోజీ కూడా యాడ్ చేసింది రష్మిక మందనా. మామూలుగా విజయ్, రష్మికల్లో ఎవరి సినిమా విడుదలయినా కూడా ఒకరికొకరు వారి సపోర్ట్‌ను అందించుకుంటారు. ఆ సినిమాలపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. దీంతో వీరు లవర్స్ అనే రూమర్స్ మరింత బలపడుతూ వస్తున్నాయి.
Madness. 🔥 https://t.co/LfDvUeAtpx
— Rashmika Mandanna (@iamRashmika) August 2, 2024
స్పై థ్రిల్లర్..
‘వీడీ 12’.. ఒక స్పై థ్రిల్లర్ అని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఎప్పుడో అనౌన్స్ చేశారు. అంతే కాకుండా మొహం కనపడకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశారు. కానీ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ ఇలా ఉంటుందని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. విజయ్.. చివరిగా ‘ఫ్యామిలీ స్టార్’తో ప్రేక్షకులను అలరించాడు. కానీ ఆ మూవీ ఆశించినంత రేంజ్‌లో హిట్ అవ్వకపోగా ఎన్నో ట్రోల్స్‌ను ఎదుర్కుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’లో అర్జునుడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ‘వీడీ 12’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
Also Read: విజయ్ దేవరకొండ సినిమాలో మరో యంగ్ హీరో - మల్టీ స్టారర్‌కు సిద్ధమంటున్న రౌడీ హీరో