అన్వేషించండి

Rashmika Mandanna: అల్లు అర్జున్‌కు రష్మిక స్పెషల్ గిఫ్ట్... అందులో వెండి కాయిన్ ఎందుకు పెట్టిందో తెలుసా?

Allu Arjun gifts Rashmika: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు రష్మిక మందన్నా ఇటీవల స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందులో వెండి కాయిన్ ఎందుకు పెట్టిందో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'పుష్ప 2 : ది రూల్' త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కి ఒక గిఫ్ట్ ను పంపించిన విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ బ్యూటీ రీసెంట్ గా అల్లు అర్జున్ కి ఒక స్వీట్ నోట్ తో పాటు వెండి నాణెం (Silver Coin)ని బహుమతిగా ఇచ్చింది. సాధారణంగా సెలబ్రిటీలు ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్ లు చాలా కాస్ట్లీగా ఉంటాయి. కానీ, అల్లు అర్జున్ కి రష్మిక ఇలా ఎందుకు వెండి కాయిన్ ని బహుమతిగా పంపించిందో తెలుసా? 

దేశ వ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదన్నా ఉందా అంటే అది 'పుష్ప 2' మూవీనే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న తాజాగా అల్లు అర్జున్ కి దీపావళి కానుకగా పంపిన గిఫ్ట్ గురించి చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ ఆమె పంపిన గిఫ్ట్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అందులో రష్మిక మందన్న అల్లు అర్జున్ కి ఒక వెండి కాయిన్ ని బహుమతిగా ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఇలా ఎందుకు ఇచ్చిందో ఆ నోట్లో వివరంగా చెప్పుకొచ్చింది.

వెండిని బహుమతిగా ఇవ్వడం అనేది తీసుకున్న వారికి అదృష్టాన్ని కలిగిస్తుందని తన తల్లి గట్టిగా నమ్ముతుంది అంటూ రష్మిక మందన్న ఆ నోట్ లో రాసుకు వచ్చింది. అంటే తనిచ్చే ఆ చిన్న బహుమతి అల్లు అర్జున్ కు అదృష్టాన్ని, పాజిటివిటీని, అలాగే ప్రేమను తీసుకురావాలని ఆమె ఆశించిందన్నమాట. అయితే వెండి ఇస్తే ఇలా అదృష్టం, పాజిటివిటీ కలసి వస్తాయి అని అనుకోవడానికి గల కారణాలు ఏమిటంటే దానికి ఉన్న విలువైన ఆధ్యాత్మిక లక్షణాలు. 

Read Also : Prabhas: పెళ్లి గురించి మాట్లాడిన ప్రభాస్... రెబల్ స్టార్ పర్సనల్ లైఫ్‌లో కన్‌ఫ్యూజన్ అంతా ఆ పాటల వల్లేనా? 

ముఖ్యంగా వెండి కి నెగిటివిటీని దూరం చేసి, చుట్టుపక్కల ఎలాంటి నెగటివ్ ఎనర్జీ చేరకుండా చేసే సామర్థ్యం ఉందని అంటారు. దాని రిఫ్లెక్టివ్ నేచర్ హానికరమైన శక్తులను దూరం చేస్తుందని, వెండి ధరించిన వారికి ఒక రక్షణ కవచం లాగా పని చేస్తుందని చాలామంది నమ్ముతారు. అలాగే వెండి చంద్రుడికి సింబల్ అని, చంద్రుడి శక్తితో ఉన్న రక్షణ లక్షణాలు ఇందులో ఉంటాయని అంటారు. ఈ కారణంగానే చాలామందికి వెండి ఆభరణాలు లేదా వస్తువులు ఇలా ఆధ్యాత్మిక పరంగా నెగిటివిటీని దూరం చేసే శక్తిగా పని చేస్తాయని అనుకుంటారు. అందుకే ప్రత్యేకమైన వేడుకల్లో వెండిని బహుమతిగా ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. 

ఇక 'పుష్ప 2' మూవీ విషయానికి వస్తే ఈ భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 5న భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతోంది.

Read Also : Kanguva: తమిళ తంబీల కంటే ముందే తెలుగు ప్రేక్షకులు 'కంగువ'ను చూడవచ్చు... ఎందుకో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Adani Group: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
Adilabad Tiger News Today: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరుగుతున్న పులులు ఎన్ని? అధికారులు ఏం చెబుతున్నారు?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
AR Rahman - Mohini Dey: గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
గంటల వ్యవధిలో రెహమాన్ - మోహిని విడాకులు... అసలు విషయం చెప్పేసిన సైరా బాను లాయర్
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌
Embed widget