Kanguva: తమిళ తంబీల కంటే ముందే తెలుగు ప్రేక్షకులు 'కంగువ'ను చూడవచ్చు... ఎందుకో తెలుసా?
'కంగువా'ను తమిళ తంబీల కంటే ముందే తెలుగు వాళ్ళు చూడవచ్చు. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా స్పెషల్ షోల పర్మిషన్స్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya Sivakumar) మోస్ట్ అవైటింగ్ మూవీ 'కంగువ' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ షోల పర్మిషన్ దొరికింది. అయితే, ఈ పాన్ ఇండియా సినిమాకు తెలుగులో స్పెషల్ పర్మిషన్స్ దొరకడం ఒక విశేషం. అయితే, తమిళ తంబీల కంటే ముందే తెలుగు మూవీ లవర్స్ ఈ సినిమాను చూడబోతున్నారు. మరి ఇది ఎలా సాధ్యమో తెలుసుకుందాం పదండి.
సాధారణంగా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ముఖ్యంగా మాతృభాషలో సదరు సినిమాకు సంబంధించిన హడావిడి రిలీజ్ కు కొన్ని రోజుల ముందు నుంచే ఉంటుంది. కానీ 'కంగువ' విషయంలో మాత్రం డిఫరెంట్ గా జరుగుతుంది. ఈ మూవీ స్పెషల్ షోలకు తమిళనాడు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా ముందుగా ఆడబోతోంది. ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న 'కంగువ' స్పెషల్ షోకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా స్పెషల్ షోలకు పర్మిషన్స్ లభించాయి. ఈ మేరకు నవంబర్ 14 న తెల్లవారు జామున 4 గంటలకే తెలుగు రాష్ట్రాలతో పాటు అక్కడ కూడా తొలి ఆటను ప్రదర్శించబోతున్నారు. కానీ తమిళనాడులో మాత్రం ఇలాంటి అనుమతి లభించలేదు.
కేవలం ఒక్కరోజు మాత్రమే 'కంగువా' స్పెషల్ షోలు వేసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం 'కంగువా' విషయంలో నాలుగు ఆటలతో పాటు అదనంగా మరో ఆటను మాత్రమే వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది కూడా తొలి షో ఉదయం 9 గంటలకు, చివరి షో అర్ధరాత్రి 2 గంటలలోపు ప్రదర్శించుకోవచ్చు అన్నది ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఉన్న సారాంశం. దీంతో మొత్తానికి ఈ సినిమా సూర్య సొంత గడ్డ తమిళనాడు కంటే ముందే ఇతర భాషల్లో రిలీజ్ కాబోతోంది.
గతంలో ఓ థియేటర్లో బెనిఫిట్ షో టైంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా తమిళనాడు ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి నిరాకరిస్తోంది. కోలీవుడ్ లోనే బిగ్ స్టార్స్ అయిన రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ వంటి స్టార్స్ సినిమాలకు కూడా ఇదే రూల్ ను వర్తింపజేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ 'ది గోట్' మూవీకి మాత్రం ఉదయం 9 గంటల ఆటకు అనుమతినిచ్చారు. కానీ సూర్యకు అదనంగా రాత్రి 2 గంటల లోపు మరో ఆటకు కూడా అనుమతినివ్వడం విశేషం. కానీ అది కూడా ఒక్క రోజే కావడం గమనర్హం. మొత్తానికి తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోలు పడే ఛాన్స్ లేదు. కాగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'కంగువా' సినిమాలో దిశా పటాని, బాబి డియోల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీతో సహా పది భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. మరి సూర్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.