అన్వేషించండి

Rashmika: రష్మిక చేతిలో ఫోన్ లాగేసుకున్న బౌన్సర్ - ట్విస్ట్ ఎమిటంటే..

అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న సమయంలో.. రష్మికాకు ఊహించని అనుభవం ఎదురైంది. రష్మిక చేతిలో ఉన్న ఓ అభిమాని ఫోన్‌ను ఆమె బాక్సార్ విసురుగా లాక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అంటే కుర్రకారుకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంటోంది. చివరికి ముంబయిలో కూడా ఆమెకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె అంటే వారికి ఎంత ఇష్టమంటే.. ఏకంగా ఆమె ఫోనే చేతిలో నుంచి లాగేసుకునేంత. ఔనండి, నిజం.. తాజాగా ఓ అభిమాని రష్మికాకు ఊహించని షాకిచ్చాడు. 

ఏం జరిగిందంటే..

సోమవారం (జులై 11) రష్మిక ముంబయిలో ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొంది. ఆమెను చూసేందుకు అక్కడికి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. కొందరైతే ఏకంగా ఆమె కారవాన్ చుట్టూ గుమిగూడారు. రష్మికాను చూడగానే సెల్ఫీల కోసం ఎగబడ్డారు. రష్మిక కూడా వారికి నో చెప్పకుండా చాలా ఓపిగ్గా వారితో సెల్ఫీలు దిగింది. ఇంతలో ఒక అభిమాని ఆమెతో ఫొటో దింగేందుకు ఫోన్ ముందుకు పెట్టాడు. రష్మిక ఆ ఫోన్‌ను తన చేత్తో పట్టుకుని తన అభిమానికి హెల్ప్ చేయడానికి ప్రయత్నించింది. అయితే, ఆమె పక్కనే ఉన్న బౌన్సర్ ఆమె చేతిలో పోన్‌ను విసురుగా లాక్కున్నాడు. ఆ తర్వాత ఆ ఫోన్‌ను ఆ అభిమానికి ఇచ్చేశాడు. అతడి పనికి రష్మిక కాస్త షాకైనా.. మళ్లీ స్మైల్‌తో కవర్ చేసింది. మిగతా అభిమానులతో కూడా సెల్ఫీలకు దిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియో సరిగ్గా చూడనివారు.. అభిమానే ఆమె చేతి నుంచి ఫోన్ లాక్కున్నట్లు ప్రచారం చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

విజయ్‌తో రష్మిక బ్రేకప్?

విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నా రిలేషన్‌లో ఉందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా వీరి పోస్టులు ఇందుకు బలం చేకూర్చాయి. అయితే, తాజాగా రష్మిక పోస్ట్ చేసిన ఓ వీడియోను కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో విజయ్, రష్మిక విడిపోయారని అందుకే రష్మిక ఈ వీడియో షేర్ చేసింది అంటున్నారు ఆ వీడియో చూసిన నెటిజన్స్. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో 'విడిపోవడం' గురించి ఓ ఇన్స్పిరేషనల్ వీడియోను షేర్ చేసింది. దీంతో రష్మికకు ఏమైంది అంటూ ఆరా తీయడం ప్రారంభించారు నెటిజన్స్. రష్మిక, విజయ్ విడిపోతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

‘పుష్ప 2’, ‘యానిమల్’ సినిమాలతో రష్మిగా బిజీ బిజీ..

రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది రష్మిక. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ కూడా నటించగా, సాయి పల్లవి కూడా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా, రష్మిక పైప్‌ లైన్‌లో ‘యానిమల్’ మూవీ కూడా ఉంది. రణబీర్ కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ మూవీకు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. 

Also Read: కమల్ హాసన్ టైటిల్‌తో తెలుగులోకి ఉదయనిధి స్టాలిన్ 'మామన్నన్' - రిలీజ్ ఎప్పుడంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Objection My Lord Series Trailer : మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
Jana Nayakudu Review - 'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?
'జన నాయకుడు' రివ్యూ: 'భగవంత్ కేసరి' రీమేకేనా? విజయ్ సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget