Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డే: బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రష్మిక
Allu Arjun: ఇవాళ అంతా 'పుష్ప' మేనియా నడుస్తోంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ విషెస్ చెప్తున్నారు. ఇక రష్మిక చెప్పిన బర్త్ డే విషెస్ అయితే సో స్పెషల్.
Rashmika Mandanna shared Special Photo of Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా 'పుష్ప - 2' టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. టీజర్ లో అల్లు అర్జున్ ని చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అంత బాగుంది టీజర్. గూజ్ బంప్స్ తెప్పించేశాడు సుకుమార్. ఇక ఆయనకు టాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్ స్టార్స్, అభిమానులు అందరూ విషెస్ చెప్తున్నారు. పొద్దున్న నుంచి అంతా 'పుష్ప' మేనియానే నడుస్తోంది సోషల్ మీడియాలో. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి ఆయన కో స్టార్.. రష్మిక మందన్న చెప్పిన విషెస్ సో స్పెషల్ అంటున్నారు ఫ్యాన్స్. 'పుష్ప - 2' సెట్స్ నుంచి స్పెషల్ ఫొటో షేర్ చేసిన రష్మిక అల్లు అర్జున్ కి విషెస్ చెప్పింది.
అన్ సీన్ ఫొటో..
'పుష్ప'లో అల్లు అర్జున్ సరసన నటించింది రష్మిక. ఇప్పుడిక 'పుష్ప - 2' లో కూడా అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆమె ఒక బీటీఎస్ ఫొటో షేర్ చేసింది. అదేనండి.. బిహైండ్ ద సెట్స్ ఫొటో షేర్ చేసింది. అల్లు అర్జున్ పుష్ప గెటప్ లో సింహం బొమ్మ పక్కన కూర్చుని ఉన్నారు. దాంట్లో అల్లు అర్జున్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. 'హ్యాపీయస్ట్ బర్త్ డే పుష్ప రాజ్' అని క్యాప్షన్ రాసుకొచింది. దీంతో ఇప్పుడు ఆఫొటో వైరల్ అవుతోంది.
రష్మిక మందన్నా.. షేర్ చేసిన ఫొటో ఇదే
అల్లుఅర్జున్ బర్త్ డే గిఫ్ట్ టీజర్..
ఇక అల్లుఅరజున్ బర్త్ డే గిఫ్ట్ గా టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. 'పుష్ప 2' టీజర్ ఒక రేంజ్ లో ఉంది. ఇందులో గంగమ్మ జాతరను హైలైట్ చేశారు. ఆల్రెడీ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంది. ఆ లుక్ ఈ టీజర్ లోనూ కంటిన్యూ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్.. ఆ గెటప్ లో ఆయన్ను చూసిన అభిమానులకు పూనకాలు వచ్చాయనే చెప్పాలి. ఇప్పుడు అన్న పాన్ ఇండియా స్టార్.. ఆ మాత్రం ఉండాలిగా అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే..
ఈ నెల 5న రష్మిక బర్త్ డే సందర్భంగా కూడా 'పుష్ప - 2' టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. రష్మిక మందన్న లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. హ్యాపీ బర్త్ డే శ్రీవల్లి అంటూ ఈ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. అల్లు అర్జున్, రష్మికకు పెళ్లి కావడంతో ‘పుష్ప’ సినిమా కంప్లీట్ అవుతుంది. సీక్వెల్ లో పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి కనిపించబోతోంది. ఈ పోస్టర్ లో రష్మిక ఒంటి నిండా నగలతో పట్టుచీర కట్టుకుని, జుట్టును వెనకకు కట్టుకుని కనిపించింది. ఆమె చేతి వేళ్లను రింగులా పెట్టి అందులోనుంచి చూస్తూ జోష్ ఫుల్ గా కనిపిస్తుంది. ఆమె నుదిటిపై బొట్టుతో కనిపించింది. దీంతో ఫ్యాన్స్ ఆమెను స్క్రీన్ పై చూసేందుకు వెయిట్ చేస్తున్నారు.
Also Read: పెళ్లయ్యాక కూడా అది చెయ్యాలి, అప్పుడే లైఫ్ హ్యాపీ: విజయ్ ఆంటోని