Rashmika Mandanna: ఎటువంటి టైంలోనైనా ఆయన పక్కన ఉండాల్సిందే... కాబోయే వాడిపై రష్మిక మందన్న కామెంట్స్
ఎలాంటి టైమ్ లోనైనా ఆయన పక్కన ఉండాల్సిందే అంటూ రష్మిక మందన్న తాజా ఇంటర్వ్యూలో కాబోయే వాడి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా రోజుల నుంచి రూమర్లు విన్పిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంపై ఎప్పుడూ రష్మిక గాని, లేదా విజయ్ దేవరకొండ గానీ స్పందించలేదు. అయితే ఇన్ డైరెక్ట్ గా వీళ్ళు ఇచ్చే హింట్స్ చూసి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రష్మిక మందన్న తన లైఫ్ పార్ట్నర్ గురించి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అతను నా పక్కన ఉండాల్సిందే
రష్మిక మందన్న తాజాగా ఓ ఇంటర్వ్యూలో లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడింది. అయితే ఇక్కడ ఆమె ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ... విజయ్ దేవరకొండతో ఆమె డేటింగ్ లో ఉంది అంటూ పుకార్లు కొనసాగుతున్న నేపథ్యంలో రష్మిక మందన్న చేసిన ఈ కామెంట్స్ ఆయనను ఉద్దేశించే అంటూ వైరల్ అవుతున్నాయి. ఇక ఇంటర్వ్యూలో రష్మిక లైఫ్ పార్టనర్ లో ఉండాల్సిన విలువైన లక్షణాల గురించి మాట్లాడింది.
రష్మిక మాట్లాడుతూ పార్ట్నర్ కష్ట సమయాల్లో పక్కన ఉంటే చాలు ఓదార్పు, సపోర్ట్, భద్రతను, సానుభూతి ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకొచ్చారు. అలాగే పార్ట్నర్ లో దయ, గౌరవం ఉండడం చాలా ముఖ్యమని, ఒకరినొకరు గౌరవించుకుంటూనే... శ్రద్ధ చూపించడం, బాధ్యతగా వ్యవహరించడం చాలా కీలకమని రష్మిక అన్నారు. ఇలాంటి లక్షణాలు లైఫ్ పార్టనర్ కు మరింత విలువను ఇస్తాయని ఆమె వెల్లడించింది. అంతేకాకుండా ఇద్దరూ ఒకే విధమైన విలువలను పాటించకపోతే, ఆ జంట కలిసి ఉండే అవకాశం ఉండదని రష్మిక మందన్న ఈ సందర్భంగా పేర్కొంది. అలాగే తన విషయానికి వస్తే ప్రేమలో ఉండటం అంటే... స్ట్రాంగ్ పార్టనర్షిప్, కంపానియన్ షిప్ ఉండాల్సిందేనని వివరించింది రష్మిక. మంచి, చెడు సమయాల్లో కచ్చితంగా పక్కన పార్టనర్ ఉండాల్సిందేనని నమ్ముతానని, అలాంటి వాళ్లే తోడుగా లైఫ్ లాంగ్ నిలబడి ఉంటారని చెప్పుకొచ్చింది.
Also Read: బెయిల్‌పై బయటకొచ్చిన పవిత్ర గౌడ... ఆ గుడిలో దర్శన్ పేరు మీద ప్రత్యేక పూజలు - జనాల రియాక్షన్ ఏమిటంటే?
డేటింగ్ లో విజయ్ దేవరకొండ
ఇక గత నెల విజయ్ దేవరకొండ తాను డేటింగ్ లో ఉన్నాను అనే విషయాన్ని అఫీషియల్ గానే ఒప్పుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో అతని రిలేషన్షిప్ స్టేటస్ గురించి ప్రశ్న ఎదురు కాగా... విజయ్ దేవరకొండ నవ్వుతూ "ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా ?" అంటూనే తాను డేటింగ్ లో ఉన్నానని చెప్పేశారు. మరోవైపు రష్మిక మందన్న కూడా రీసెంట్ గా 'పుష్ప 2' ఈవెంట్లో 'అతను ఎవరో మీ అందరికీ తెలుసు' అంటూ చెప్పకనే చెప్పేసింది. ఇక 'పుష్ప 2' మూవీని రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి చూసిన సంగతి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ చేసే పనులు వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు అనే పుకార్లకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరూ ఇప్పటిదాకా ఎక్కడా ఈ విషయాన్ని అధికారికంగా బయట పెట్టలేదు.