అన్వేషించండి

Rashmika Mandanna: అలా ఎవరు చెప్పారు? రూమర్స్‌కు రష్మిక మందనా ఘాటు రిప్లై

Aadavallu Meeku Johaarlu: రష్మిక.. శర్వానంద్‌తో కలిసి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే మూవీలో నటించింది. ఆ సినిమాపై తాజాగా పలు రూమర్స్ వైరల్ అవుతుండగా.. రష్మిక వాటికి ఘాటు రిప్లై ఇచ్చింది.

Rashmika Mandanna: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ మూవీ ద్వారా రణబీర్ కపూర్‌ క్యారెక్టర్‌కు ఎంత పాపులారిటీ లభించిందో.. గీతాంజలిగా రష్మిక పాత్రకు కూడా అంతే పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా తర్వాత నుండి రష్మికపై అనేక రూమర్స్ వైరల్ అవ్వడం మొదలయ్యింది. ఇటీవల తను రెమ్యునరేషన్ పెంచేసిందంటూ, తెలుగు సినిమాల నిర్మాతలపై రెమ్యునరేషన్ భారాన్ని వేసిందంటూ రూమర్ వచ్చింది. ఇక తాజాగా తను ఒక తెలుగు సినిమాను ఇష్టం లేకుండానే ఒప్పుకున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చిందని రూమర్ వైరల్ అవుతోంది. దీనిపై ఫైనల్‌గా రష్మిక స్పందించింది.

భారీ డిసాస్టర్..

కన్నడలో హీరోయిన్‌గా పరిచయమైనా కూడా రష్మిక మందనాకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది మాత్రం తెలుగు సినిమాలే. ‘ఛలో’తో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక.. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ‘పుష్ప’లాంటి హిట్‌ను అందుకున్న తర్వాత కిషోర్ తిరుమల, శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిసాస్టర్‌గా నిలిచింది. పైగా స్క్రిప్ట్ అస్సలు బాలేదని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా అసలు ఈ సినిమా స్క్రిప్ట్ తనకు అస్సలు నచ్చలేదని, శర్వానంద్ కోసమే తాను ఇది చేయడానికి ఒప్పుకుందని రష్మిక స్టేట్‌మెంట్ ఇచ్చినట్టుగా రూమర్స్ వైరల్ అయ్యాయి.

అలా అయితేనే సినిమా చేస్తాను..

తనకు ఇష్టం లేకుండానే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో రష్మిక నటించింది అని వస్తున్న రూమర్స్‌పై ఫైనల్‌గా ఈ హీరోయిన్ స్పందించక తప్పలేదు. ‘‘ఎవరు చెప్పారు? నేను స్క్రిప్ట్‌ను నమ్ముతాను కాబట్టే సినిమాలు చేస్తాను. అంతే కాకుండా అలాంటి క్యాస్ట్ అండ్ క్రూతో పనిచేయడం నా అదృష్టం. ఇలాంటి ఆధారం లేని రూమర్స్ అసలు ఎక్కడ నుండి మొదలవుతాయో అర్థం కావడం లేదు’’ అంటూ రష్మిక మందనా క్లారిటీ ఇచ్చింది. డిజాస్టర్ సినిమా కాబట్టి నిజంగానే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో నటించడం రష్మికకు ఇష్టం లేదేమో అని చాలామంది ఫ్యాన్స్.. ఈ రూమర్‌ను నమ్మారు. ఫైనల్‌గా ఇందులో నిజం లేదని తేల్చేసింది ఈ కన్నడ బ్యూటీ.

రెమ్యునరేషన్ పెంపుపై క్లారిటీ..

ఇటీవల తను భారీగా రెమ్యునరేషన్ పెంచేసింది అని వస్తున్న వార్తలపై కూడా రష్మిక స్పందించింది. ‘ఇది ఎవరు చెప్పారా అని ఆశ్చర్యపోతున్నాను. ఇదంతా చూసిన తర్వాత నిజంగానే అలా చేసి ఉండవచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఎందుకిలా చేశావని నిర్మాతలు అడిగితే.. బయట మీడియా ఇదే చెప్తుంది సార్, వాళ్ల మాటను నేను నిజం చేస్తున్నాను, అంతకంటే ఏం చేయగలను అని చెప్తాను’ అంటూ కౌంటర్ ఇచ్చింది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తనపై వస్తున్న ఆధారం లేని రూమర్స్‌పై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వస్తోంది రష్మిక. ప్రస్తుతం తను ‘పుష్ప 2’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ ఏడాది మొత్తంగా నాలుగు రిలీజ్‌లను లైన్‌లో పెట్టింది రష్మిక మందనా.

Also Read: నారా లోకేష్‌కు ఆర్జీవీ ఫ్లయింగ్ కిస్ - ఎన్టీఆర్ కంటే జూనియ‌ర్ ఎన్టీఆరే గొప్ప‌ అంటూ స్టేట్‌మెంట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget