Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రష్మిక.. అసలు నిజం ఇదే!
Rashmika Mandanna Engagement : విజయ్ దేవరకొండతో వస్తోన్న వార్తలను రష్మిక ఖండించింది. ఈసారి ముంబైలో తిరుగుతూ రూమర్స్‌కు చెక్ పెట్టింది ఈ బ్యూటీ.

Rashmika Mandanna Engagement Rumours : దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2025లో రష్మికా మందన్న మెరిశారు. అక్కడ ఆమె షాంపైన్ రంగు చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. తన స్టైల్‌తో అందరినీ ఆకట్టుకోగా.. అప్పుడు ఆమె ఎడమ చేతికి ఉన్న డైమండ్ రింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకేముంది ఆమె నార్మల్‌గా పెట్టుకున్నా.. లేదు లేదు ఇది కచ్చితంగా ఎంగేజ్మెంట్ రింగ్‌నే అని న్యూస్ వైరల్ అయిపోయింది. ఆమెకు నిశ్చితార్థం అయిపోయిందని.. విజయ్ దేవరకొండనే పార్టనర్(Rashmika Mandanna Engagement Rumours with Vijay Devarakonda) అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరిపారు. ఎప్పటినుంచో వీరిపై రూమర్స్ ఉండడం, వీరు కూడా ఎక్కువగా కలిసి కనిపించడంతో చాలామంది ఆమె నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందని నమ్మారు.
రూమర్లకు చెక్ పెట్టిన రష్మిక
ఈ మధ్యకాలంలో రష్మిక ఈ రింగ్ పెట్టుకుని కనిపించడంతో అది నిజంగానే ఎంగేజ్మెంట్ రింగ్ అని అందరూ భావించారు. అయితే తాజాగా రష్మిక ఈ రూమర్లకు తెరదించింది. రీసెంట్గా ముంబైలో ఒక సెలూన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు రష్మిక కెమెరాకు చిక్కింది. ఈసారి ఆమె చేతికి ఉంగరం కనిపించలేదు. అయితే ఆ డైమండ్ రింగ్ కేవలం లుక్‌కోసం మాత్రమే పెట్టుకుందని.. ఆమెకు ఎంగేజ్మెంట్ జరగలేదని మళ్లీ సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేస్తున్నారు.
View this post on Instagram
రష్మిక ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలాంటి ఎన్నో రూమర్స్ ఎదుర్కొంది. పైగా ఆమెకూడా చాలాసార్లు హింట్స్ ఇస్తూ వచ్చింది. దీనిలో భాగంగానే పుష్ప 2 ప్రమోషన్ల సమయంలో ఓ వ్యక్తి.. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా అని అడిగినప్పుడు.. రష్మిక నవ్వుతూ.. “అందరికీ తెలుసు” అని రిప్లై ఇచ్చింది. దాంతో అక్కడున్న ప్రేక్షకులు చప్పట్లు కొట్టగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం నవ్వారు. ఇప్పటికే విజయ్ దేవరకొండతో రూమర్స్ ఉండడంతో అదే ఏడాది వారిద్దరి పెళ్లి ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి మరింతగా అడిగినప్పుడు రష్మిక “ఇప్పుడే దాని గురించి లోతుగా చర్చించవద్దు. నేను వ్యక్తిగతంగా తరువాత షేర్ చేస్తాను” అంటూ సైలెంట్ అయిపోయింది. ఆమె ఫన్నీగానే రిప్లై ఇచ్చినా.. విజయ్‌తో ఆమెకున్న రిలేషన్‌ని మరింత హైలెట్ చేసేలా మాట్లాడింది అంటూ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు.
రష్మికతో విజయ్ బంధం
విజయ్ దేవరకొండ, రష్మికతో గీత గోవిందం (2018)లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ (2019)లో నటించారు. తెరపై వారి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. తెర వెనుక కూడా వారు ఎక్కువసార్లు కనిపించడం వల్ల డేటింగ్ రూమర్స్ ఎక్కువ అయ్యాయి. దీనిపై ఇద్దరూ క్లారిటీ ఇవ్వనప్పటికీ.. తరచుగా వెకేషన్లకు వెళ్తూ మీడియా దృష్టిలో పడతారు.
రష్మిక అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లు
వర్క్ విషయంలో రష్మిక ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. త్వరలోనే తెలుగులో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాడోక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ థామా, కాక్‌టైల్ సీక్వెల్‌లో కూడా రష్మిక చేస్తుంది. ఆమె చేసిన దాదాపు అన్ని సినిమాలు హిట్ కావడం.. పాన్ ఇండియా రేంజ్ సంపాదించుకోవడంతో స్టార్‌డమ్ పెరిగింది ఈ బ్యూటీకి. మరి పెళ్లి కబురు ఇప్పట్లో చెప్తోందా? లేదా గ్యాప్ తీసుకుంటుందో ఎదురు చూడాల్సిందే.






















