Rashmika Mandanna: పూజా హెగ్డే పాటకు రష్మిక స్టెప్పేస్తే? ఒక్క రోజులో 33 లక్షల లైక్స్ అండ్ కౌంటింగ్!
Rashmika Mandanna groove to Arabic Kuthu: పూజా హెగ్డే పాటకు రష్మిక స్టెప్పేస్తే... ఒక్క రోజులో అక్షరాల 33 లక్షల లైక్స్ వచ్చాయి. ఆ కథేంటో చూడండి.
పూజా హెగ్డే పాటకు రష్మికా మందన్నా స్టెప్పేస్తే ఎలా ఉంటుందో చూశారా? ఇంకా లేదా? అయితే... వెంటనే చూసేయండి. ఒక్క రోజులో రష్మిక డ్యాన్స్ చేసిన వీడియోకు 33 లక్షల లైక్స్ వచ్చాయి. ఇంకా వస్తూ ఉన్నాయి. ఇంతకీ, ఆ కథ ఏంటంటే...
తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా కనిపించనున్న సినిమా 'బీస్ట్'. దీనికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో 'అరబిక్ కుతు...' సాంగ్ రిలీజ్ చేసి మూడు వారాలు అయ్యింది. ఆల్రెడీ 155 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేనా? ప్రేక్షకులను మాత్రమే కాదు, చాలా మంది సినిమా హీరోయిన్లను సైతం ఆకట్టుకుంటోంది. 'అరబిక్ కుతు...' హుక్ స్టెప్ వేయడానికి సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్నారు. ఎయిర్ పోర్టులో 'అరబిక్ కుతు...'కు సమంత వేసిన హుక్ స్టెప్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్మికా మందన్నా వంతు వచ్చింది.
Also Read: ప్లాన్ చేసి చేయలేదు, క్లారిటీ ఇచ్చిన సమంత
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కలిసి ఒక కమర్షియల్ యాడ్ చేస్తున్నారు. షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికిందో? లేదంటే ఇద్దరూ కలిసి 'అరబిక్ కుతు...'కు స్టెప్ వేయాలని అనుకున్నారో? వేశారు. రష్మికను ట్యాగ్ చేస్తూ... ఆ వీడియోను వరుణ్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 24 గంటలు గడవక ముందే దానిని 33 లక్షల మంది లైక్ చేశారు. అదీ సంగతి!
Also Read: సమంత - పూజా హెగ్డే మధ్య గొడవ ముగిసినట్టేనా!?
View this post on Instagram