Ranga Ranga Vaibhavanga Release Date: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున మేనల్లుడి సినిమా - థియేటర్లలో రంగ రంగ వైభవమే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఆయన మేనల్లుడి సినిమా విడుదల కానుంది.
![Ranga Ranga Vaibhavanga Release Date: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున మేనల్లుడి సినిమా - థియేటర్లలో రంగ రంగ వైభవమే Ranga Ranga Vaibhavanga Release Date Occasion of Pawan Kalyan's Birthday Vaishnav Tej Ketika Sharma's RRV Movie Hit Screens on Sept 2 Ranga Ranga Vaibhavanga Release Date: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున మేనల్లుడి సినిమా - థియేటర్లలో రంగ రంగ వైభవమే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/3911c2b28ce620585b91349b1eafb3ef1657693869_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సెప్టెంబర్ 2... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ రోజు. అభిమాన కథానాయకుడి పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. ఆ సెలబ్రేషన్స్ డబుల్ చేయడానికి థియేటర్లలోకి వస్తున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.
పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej), 'రొమాంటిక్' ఫేమ్ కేతికా శర్మ (Ketika Sharma) జంటగా నటించిన చిత్రం 'రంగ రంగ వైభవంగా'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. గిరీశయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు.
తొలుత మే 27న 'రంగ రంగ వైభవంగా'ను విడుదల చేయాలని భావించారు. కరోనా కారణంగా సినిమాలు అన్నీ ఒక్కసారి థియేటర్లలోకి క్యూ కట్టడంతో వాయిదా వేశారు. ఆ తర్వాత జూలై 1న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 2కు వెళ్లారు. ఇకపై వాయిదాలు ఉండవని, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున థియేటర్లలోకి 'రంగ రంగ వైభవంగా' విడుదల కావడం ఖాయమని తెలుస్తోంది.
Also Read : కమల్ హాసన్‌కు, నాగార్జునకు పోలిక ఏంటి?
ఆల్రెడీ విడుదలైన 'రంగ రంగ వైభవంగా' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన 'కొత్తగా లేదేంటి...', 'తెలుసా తెలుసా...' పాటలు కూడా! టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)