Ranbir Kapoor : రణబీర్ నోట బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ - దద్దరిల్లిన 'అన్ స్టాపబుల్' స్టేజ్!
Ranbir Kapoor : 'యానిమల్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న రణబీర్ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ ను తెలుగులో చెప్పినట్లు తెలుస్తోంది.
Ranbir Kapoor in Unstoppable Show : నటసింహం నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ ని మరో స్టార్ హీరో చెబితే ఎలా ఉంటుంది? అది కూడా బాలీవుడ్ హీరో చెప్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే క్రేజీగా ఉంది కదూ! ఈ అరుదైన మూమెంట్ తాజాగా 'అన్ స్టాపబుల్'(Unstoppable) షోలో బాలయ్య ముందే జరగడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రెండు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ రీసెంట్ గానే మొదలైంది. ఈసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఆహా ఓటీటీ(Aha OTT)లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ షో కోసం సౌత్ ఆడియన్స్ తో పాటు బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ఈ షో కి బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) రావడమే. 'యానిమల్'(Animal) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ కపూర్, రష్మిక మందన, డైరెక్టర్ సందీప్ వంగా 'అన్ స్టాపబుల్ సీజన్ 3' లో సందడి చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో రణబీర్, బాలకృష్ణ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. మొట్టమొదటిసారి ఓ బాలీవుడ్ హీరో బాలయ్య షోలో సందడి చేయడంతో ఆ మూమెంట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే షూటింగ్ పూర్తకముందే ఈ ఎపిసోడ్ కు సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. తాజాగా వచ్చిన లీక్స్ ప్రకారం.. ఈ షోలో రణబీర్ కపూర్ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ ను చెప్పినట్లు తెలుస్తోంది. బాలయ్య హిట్ డైలాగ్స్ లో ఒకటైన "ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు" అని డైలాగును రణబీర్ తెలుగులో చెబుతూ షోలోకి అడిగిపెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాలయ్య డైలాగ్ ని రణబీర్ చెబుతుంటే చూడాలని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక 'యానిమల్'(Animal) విషయానికొస్తే.. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్(Kabir Singh) సక్సెస్ తర్వాత సందీప్ రెడ్డి వంగ హిందీలో చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా సినిమాలో రణబీర్ ని ఊర మాస్ లెవెల్లో ప్రజెంట్ చేయబోతున్నాడు సందీప్ వంగ. బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ ఈ మూవీని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. అందుకే తెలుగులోనూ ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేశారు.
ఇప్పటికే బ్రహ్మాస్త్ర(Bramhastram) మూవీతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన రణబీర్ ఇప్పుడు 'యానిమల్' తో తెలుగులోనూ సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకే బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక సినిమాలో రణబీర్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అనిల్ కపూర్జ్ బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : టికెట్ రేట్లు తక్కువే - 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'కి ప్రేక్షకులు వస్తారా?