Ranbir Kapoor: నా భార్య ఆలియా నన్ను కొడుతుంది - ‘యానిమల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రణబీర్ షాకింగ్ స్టేట్‌మెంట్
తాజాగా జరిగిన ‘యానిమల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రణబీర్ కపూర్.. తన భార్య ఆలియా భట్ గురించి ఒక షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
డిసెంబర్‌లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’. డిసెంబర్ 1న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌పే వేగవంతం చేసింది. అందులో భాగంగానే ‘యానిమల్’ ట్రైలర్‌ను లాంచ్ చేయడం కోసం ఒక ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్‌లో సినిమా గురించి మాత్రమే కాకుండా, తన పర్సనల్ లైఫ్ గురించి పలు కూడా పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు రణబీర్. ఈ ఈవెంట్‌లో తన భార్య ఆలియా భట్ గురించి కూడా ప్రస్తావించాడు.
నెగిటివ్ షేడ్స్‌తో..
తాజాగా విడుదలైన ‘యానిమల్’ ట్రైలర్.. ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రేక్షకులు చూసినా.. ‘యానిమల్’తో మరోసారి అందరినీ ఇంప్రెస్ చేయడానికి ఈ దర్శకుడు సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రణబీర్ నటించిన చాలా సినిమాల్లో తన యాక్టింగ్ ఎలా ఉంటుందో ప్రేక్షకులు పూర్తిస్థాయిలో చూశారు. కానీ మునుపెన్నడూ లేని నెగిటివ్ షేడ్స్‌తో ‘యానిమల్’లో కనిపించనున్నాడు ఈ హ్యాండ్‌సమ్ హీరో. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే తండ్రిని అమితంగా ప్రేమించే నెగిటివ్ షేడ్స్ ఉన్న కొడుకు పాత్రలో రణబీర్ కనిపించనున్నట్టు అర్థమవుతోంది. అయితే ఈ క్యారెక్టర్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు రణబీర్.
మనల్ని ప్రేమించేవారికి మంచిది కాదు..
ఇప్పటికే తన కెరీర్‌లో చేసిన అన్ని పాత్రలతో పోలిస్తే ‘యానిమల్’లో చేసిన పాత్ర చాలా కాంప్లికేటెడ్ అని రణబీర్ పలుమార్లు బయటపెట్టాడు. ఇక ట్రైలర్ చూస్తుంటే కూడా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్యారెక్టర్‌ను తను ఇంటికి తీసుకెళ్లకుండా చాలా జాగ్రత్తపడ్డాడని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రణబీర్ బయటపెట్టాడు. ‘యానిమల్’లో తన పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని, అందుకే షూటింగ్ ముగిసి ఇంటికి వెళ్లే సమయానికి తను రియల్ లైఫ్‌లో ఎలా ఉంటాడో అలా మారడానికి ప్రయత్నించేవాడని అన్నాడు. అంతే కాకుండా ఆన్ స్క్రీన్ పర్సనాలిటీని ఇంటికి తీసుకెళ్తే.. అది తమను ప్రేమించే వారికి మంచిది కాదని చెప్పాడు.
నా భార్య నన్ను కొడుతుంది..
తన పాత్రలతో తను చాలా డిటాచ్ ఉంటానని రణబీర్ క్లారిటీ ఇచ్చాడు. అది తమను ప్రేమించి వారిపై మంచి ప్రభావం చూపించదని అన్నాడు. అంతే కాకుండా నేను ఇంటికి వెళ్లి ఇలాగే ప్రవర్తిస్తే నా భార్య నన్ను కొడుతుంది అని ఫన్నీ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఇక ‘యానిమల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాతో పాటు బాబీ డియోల్, రష్మిక కూడా హాజరయ్యారు. ఇక ఈ ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్.. దీని సక్సెస్‌పై మరింత నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఏ సినిమాకు లేనంతగా 3 గంటల 21 నిమిషాల నిడివితో ‘యానిమల్’ మూవీ రిలీజ్ అవుతుంది అని ప్రకటించగానే.. ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కొందరైతే డ్యూరేషన్ చూసే సినిమా ఫ్లాప్ అని డిసైడ్ చేసేశారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత రణబీర్ యాక్టింగ్ ‘యానిమల్’కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
Also Read: నేను కనీసం దోమల్ని కూడా చంపను, అది వాళ్ల కర్మకే వదిలేస్తున్నా: రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply