అన్వేషించండి

మరో వెబ్ సిరీస్‌లో దగ్గుబాటి రానా - ఈసారి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో!

దగ్గుబాటి రానా తాజాగా 'శాన్ డిగో కామిక్ కాన్' వేదికపై తన తదుపరి ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఓ హిస్టారికల్ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.

'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుపాటి రానా ప్రస్తుతం తనదైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. సినిమాలతో పాటు ఈమధ్య వెబ్ సిరీస్లలో నటిస్తున్నాడు. ఇటీవల బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి ఈ హీరో నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇదొక బోల్డ్ వెబ్ సిరీస్. దీనిపై ఎన్నో రకాల విమర్శలు, వివాదాలు తలెత్తాయి. కానీ వాటితోనే ఈ వెబ్ సిరీస్ భారీ స్పందనను కనబరిచింది. అయితే త్వరలోనే రానా మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ఏకంగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో వెబ్ సిరీస్ తీయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దగ్గుపాటి రానా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' మూవీ టీం తో కలిసి అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే.

ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ కాన్ వేదికపై 'ప్రాజెక్ట్ కె' టైటిల్ గ్లింప్స్ ని ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ ప్రభాస్ ని సపోర్ట్ చేసేందుకు రానా అమెరికా వెళ్లారని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. రానా గ్లోబల్ వైడ్ గా తాను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసేందుకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి వెల్లడించారు. అందులో చాళుక్యుల సామ్రాజ్యంపై స్వయంగా ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు తెలిపారు. చాళుక్యుల చరిత్ర నేపథ్యంలో 'లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్' అనే పేరుతో వెబ్ సిరీస్ ని రాణా నిర్మించబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ సిరీస్ ని ప్రఖ్యాత రచయిత అనిరుధ్ కన్నిసెట్టి రచించిన  'లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్: సదరన్ ఇండియా ఫ్రమ్ చాళుక్యుస్ టు చోళస్' అనే బుక్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాలుగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశీయులు చాళుక్యుల పుట్టుక నుండి పరిపాలన కాలంలో జరిగిన ప్రధాన ఘట్టాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వెబ్ సిరీస్ కోసం ఎంచుకున్న 'లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్' అనే పుస్తకం 2022లో ఎక్కువగా ప్రాచుర్యం పొందుంది. అంతేకాదు ముంబై లిట్‌ఫెస్ట్‌లో బుక్ ఆఫ్ ది ఇయర్ (నాన్-ఫిక్షన్) అవార్డును కూడా గెలుచుకుంది. కాగా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ తో కలిసి దగ్గుపాటి రానా ఈ వెబ్ సిరీస్ ని స్పిరిట్ మీడియా బ్యానర్ పై నిర్మించబోతున్నట్లు సమాచారం.

ఫుల్ యాక్షన్ మోడ్లో ఈ వెబ్ సిరీస్ ఉండనుందట. అంతేకాకుండా సోనీ లీవ్ లోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానునట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ తో పాటు దగ్గుపాటి రానా టైటిల్ రోల్ లో 'హిరణ్యకశ్యపా' అనే ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఎంతో కాలంగా ఆలస్యం అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్టును దగ్గుపాటి రానా త్వరలోనే సైట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కామిక్ స్టోరీ 'అమర్ చిత్ర కథ' స్పూర్తితో ఈ ప్రాజెక్టుని రూపొందిస్తున్నారట. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కథను అందిస్తూ ఉండడం విశేషం. నిజానికి గతంలో దర్శకుడు గుణశేఖర్ రానాతో ఈ ప్రాజెక్టుని చేయాలి. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో త్రివిక్రమ్ పేరు తెరపైకి రావడం గమనార్హం.

Also Read : నిర్మాతగా మారిన కృతి సనన్ - కాజోల్ తో కలిసి మిస్టరీ థ్రిల్లర్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Embed widget