Rama Rajamouli: జక్కన్న అలా పరిచయమయ్యారు, వెంటనే ప్రేమ పుట్టలేదు - మా రిటైర్మెంట్ ప్లాన్ అదే: రమా రాజమౌళి
Rama Rajamouli: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు జక్కన్న.. ఆయన భార్య రమా రాజమౌళి టాప్ కాస్ట్యూమ్ డిజైనర్. ఇక ఇప్పుడు వాళ్ల లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు రమా రాజమౌళి. ఏమన్నారంటే?
Rama Rajamouli About Her Love Story : టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకరు రాజమౌళి, రమా రాజమౌళి. టాప్ డైరెక్టర్స్ లో ఒకరు రాజమౌళి. ఆయన్ను అందరూ జక్కన్న అని పిలుస్తుంటారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన డైరెక్టర్ రాజమౌళి. ఆయన సినిమాలు ఎంత బాగుంటాయో దాంట్లోని కాస్ట్యూమ్స్ కూడా అంతే స్పెషల్ గా ఉంటాయి. కారణం ఆయన భార్య రమా రాజమౌళి అంత ప్రత్యేకంగా వాటిని తయారు చేస్తారు. ఇద్దరు కలిసి సినిమాల్లో అద్భుతాలు సృష్టిస్తుంటారు. అయితే, వాళ్లిద్దరిది ప్రేమ వివాహం. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో వాళ్ల ప్రేమ గురించి, రాజమౌళి గురించి చెప్పారు రమా. ఆమె ఏమన్నారంటే?
పెద్ద లవ్ స్టోరీ ఏం కాదు..
తమదేమీ పెద్ద లవ్ స్టోరీ కాదని, పరిచయం అయిన తర్వాత చాలా రోజులకి ఇద్దరం ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నామని అన్నారు ఆమె. "కీరవాణి కజిన్ రాజమౌళి. వల్లి కీరవాణిని పెళ్లి చేసుకుంది. సో అలా రాజమౌళి మాకు తెలుసు. పరిచయం అయిన వెంటనే మాకు ఏమి అలాంటి ఒపీనియన్ లేదు. కానీ, మేమిద్దరం చాలా క్లోజ్. వాళ్ల ఫ్యామిలీకి కూడా నేను క్లోజ్. వాళ్లు చాలా ఫ్రెండ్లీ. మాదేమీ అంత పెద్ద లవ్ స్టోరీ కాదు. పరిచయం అయిన చాలా ఏళ్ల తర్వాత ప్రేమ పుట్టింది. మేమిద్దరం ఒకరికి ఒకరం బాగా తెలుసు. పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. శాంతి నివాసం టైంలో అనుకున్నాం. నేను అప్పుడు వేరే ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తున్నాను. స్టూడెంట్ నంబర్.1 మొదలైంది. అప్పుడు జరిగిపోయింది" అని తమ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు రమా.
ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం..
రాజమౌళికి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అని, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారని అన్నారు ఆమె. అలా ఫ్యామిలీని చూసుకోవాలంటే ఒకరు కావాలి కాబట్టి వర్క్ మీద ఫోకస్ పెట్టినా పర్సనల్ లైఫ్ కూడా ఆలోచించారు రాజమౌళి అని అన్నారు ఆమె. "వర్క్ మీద ఎంత ఫోకస్ ఉంటుందో ఫ్యామిలీ అంటే కూడా అంతే ఇష్టం. ఆ మైండ్‌లో ఉంటుంది కదా.. మంచి అమ్మాయో? మంచి భార్యో మంచి పార్టనర్ నో తెచ్చుకోవాలి అని అలా.. నన్ను సెలెక్ట్ చేసుకున్నారేమో. 99 శాతం మా ఇద్దరి ఒపీనియన్స్ మ్యాచ్ అవుతాయి. నిజానికి డిఫరెన్స్ ఏమీ ఉండవు. లైఫ్ లో అయితే డిఫరెన్సెస్ రావు. ఒకటే ఒపీనియన్ తో ముందుకు వెళ్తాం. సినిమా కాకుండా వేరే చాలా మాట్లాడుకుంటాం. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దాని గురించి మాట్లాడుకుంటాం. రిటైర్ అయిపోగానే ఎక్కడికి వెళ్లాలి? ఎన్ని ప్లేస్ లు చూడాల్సినవి ఉన్నావి అని మాట్లాడుకుంటాం. అన్ని దేశాల కాయిన్స్ కలెక్ట్ చేయాలనేది మా ప్లాన్. ప్రతి సినిమా తర్వాత రెండు మూడు హాలీడేస్ కి వెళ్తాం. ఒకటి ఫ్యామిలీతో వెళ్తాం. ఇంకోటి మేం పర్సనల్ గా వెళ్తాం" అని చెప్పుకొచ్చారు రమా రాజమౌళి.
Also Read: అజీత్‌తో మూవీని తిరస్కరించిన షాలిని - అదే వారి ప్రేమకు తొలి అడుగు