ఈ టిప్స్​తో మొటిమలకు చెక్ పెట్టేయొచ్చు

టీనేజ్​లో మొటిమలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

హార్మోన్ల మార్పులు, కాలుష్యం ఈ మొటిమలకు కారణమవుతాయి.

అయితే కొన్ని సింపుల్ టిప్స్​తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇది చర్మంపై జిడ్డును తగ్గించి పింపుల్స్ రాకుండా చేస్తుంది.

పింపుల్స్​ని గిల్లడం, నొక్కడం లాంటివి చేయకూడదు. వీటివల్ల బ్యాక్టీరియా ఎక్కువై సమస్య ఎక్కువయ్యే అవకాశముంది.

మొటిమలు ఉన్నప్పుడు మేకప్ వేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ వేసుకున్న రాత్రికి పూర్తిగా తీసివేయాలి.

ఎండలో బయటకు వెళ్లేప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలి. సన్​స్క్రీన్ వాడాలి.

డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్​ తీసుకోకూడదు. వేడి చేసే ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఇవి అవగాహన కోసం మాత్రమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Image Source : Envato)