Ram Charan: చెర్రీ, ఈ మీమ్‌కు అర్థమేమి? ‘గని’లోని ఆ సీన్‌పై చరణ్ ఫన్నీ ట్వీట్, వరుణ్ రిప్లై ఇది!
‘గని’ విడుదల సందర్భంగా రామ్ చరణ్ చేసిన ఈ మీమ్‌కు అర్థం ఏమిటో మీరు చెప్పగలరా?
Ghani Movie Release | వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 8న) విడుదల కానున్న సంగతి తెలిసిందే. వరుణ్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ‘గద్దలకొండ గణేష్’ సినిమా తర్వాత వరుణ్ తేజ్‌కు చాలా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 లాక్‌డౌన్‌ల వల్ల సినిమా షూటింగ్ నుంచి విడుదల తేదీల వరకు ఎన్నోసార్లు వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీతోపాటు స్నేహితులు ఈ చిత్రం హిట్ కావాలని కోరుకుంటున్నారు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్.. బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ ఎంతో శ్రమించాడు. షూటింగ్ సమయంలో వరుణ్‌కు గాయాలు కూడా అయ్యాయని చిత్రయూనిట్ చెబుతోంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందనే ఆశతో దర్శకనిర్మాతలు ఉన్నారు. RRR విజయంతో మాంచి ఊపు మీద ఉన్న రామ్ చరణ్ కూడా ‘గని’ హిట్ కావాలని విష్ చేశాడు. అయితే, ఓ మీమ్‌తో వరుణ్ తేజ్‌ను షన్నీగా విష్ చేశాడు చెర్రీ.
Also Read: ‘నేను ప్రార్థిస్తున్నా’ వరుణ్ తేజ్‌కు లావణ్య ట్వీట్, దొరిపోయావంటున్న ఫ్యాన్స్!
ఇటీవల RRR ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతున్న సమయంలో రామ్ చరణ్.. ఎన్టీఆర్ వైపు చూస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చిత్రాలను ఈ మీమ్‌లో వాడారు. దానిపైన ‘గని’లో వరుణ్ తేజ్ బాక్సింగ్ చేస్తున్న ప్రాక్టీస్ వీడియో ఉంది. అంటే, చరణ్ అతడి ప్రాక్టీస్‌ను చూస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. మరి దానికి అసలైన అర్థం ఏమిటనేది రామ్ చరణ్, వరుణ్ తేజ్‌లకే తెలియాలి. దీనిపై వరుణ్ ‘అన్నా.. లవ్ యూ’ అని స్పందించాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గని’లో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ‘గని’ చిత్రాన్ని నిర్మించారు. మరి, వరుణ్ ఈసారి విజయం లభిస్తుందో లేదో చూడాలి.
#Ghani@IAmVarunTej pic.twitter.com/QKg9NlQLUA
— Ram Charan (@AlwaysRamCharan) April 7, 2022
Hahaha..anna!!!
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) April 7, 2022
Love you!❤️❤️❤️ https://t.co/UmF4LbA7PZ
View this post on Instagram
Also Read: హిందీ సినిమా ఎందుకు? బాలీవుడ్ జనాలకు దిమ్మ తిరిగేలా ఆన్సర్ ఇచ్చిన మహేష్!