Ram Charan Viral Look: తెల్లపంచె కట్టి, సైకిల్ ఎక్కి, 'భారతీయుడి'లా రామ్ చరణ్!
సోషల్ మీడియాలో రామ్ చరణ్ లుక్ వైరల్ అవుతోంది. అందులో 'భారతీయుడి'లా ఆయన కనిపించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెల్ల పంచె కట్టుకుని, సైకిల్ తొక్కుతూ... అందులో రామ్ చరణ్‌ను చూస్తే 'భారతీయుడు' సినిమాలో కమల్ హాసన్ తరహాలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్‌తో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది అందులో లుక్ అని కొందరు అంటున్నారు. అవునా? కదా? అనేది కొన్ని రోజులు ఆగితే తప్ప తెలియదు.
రామ్ చరణ్ - శంకర్ సినిమా షూటింగ్ రాజమండ్రిలో చేశారు. అప్పుడు పబ్లిక్ ఏరియాల్లో షూటింగ్ చేయడంతో ఫ్యాన్స్ ఫొటోలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేశారు. అప్పట్లో లుక్స్ లీక్ అవ్వకుండా ఉండటం కోసం 'దిల్' రాజు ప్రొడక్షన్ హౌస్ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా... ఫొటోస్ బయటకు రావడం ఆగడం లేదు.
Also Read: రాజమండ్రిలో ప్రజలకు రామ్ చరణ్ 15 ప్రొడక్షన్ హౌస్ స్వీట్ వార్నింగ్
శంకర్‌తో చేస్తున్న సినిమా కంటే ముందు రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి మెగా పవర్ స్టార్ నటించిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' మార్చి 25న విడుదల కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ నెలాఖరులో, 29న తండ్రి చిరంజీవితో కలిసి నటించిన 'ఆచార్య' విడుదల కానుంది. ఇటీవల రామ్ చరణ్ 'ఫ్రూటీ' కోసం ఆలియా భట్ తో కలిసి యాడ్ కూడా చేశారు.
Also Read: 'ఆచార్య' సెట్‌లో అరుదైన దృశ్యం! 'చిరు' - తనయుడితో సురేఖ
View this post on Instagram