Pic Of The Day: 'ఆచార్య' సెట్‌లో అరుదైన దృశ్యం! 'చిరు' - తనయుడితో సురేఖ
'ఆచార్య' సెట్‌లో ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. అటు చిరంజీవి... ఇటు తనయుడు చరణ్... మధ్యలో సురేఖ. ఈ ఫొటో ఈ రోజు విడుదల కావడం వెనుక కారణం ఏంటంటే...
'ఆచార్య' సినిమా సెట్‌లో ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. అదేంటంటే... మెగాస్టార్ చిరంజీవి సతీమణి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తల్లి సురేఖ సెట్స్‌కు వెళ్ళారు. అటు భర్త, ఇటు కుమారుడు... ఇద్దరు కలిసి నటిస్తుండటంతో ఆమె షూటింగ్ చూడటానికి హాజరైనట్టు ఉన్నారు. సెట్స్‌కు సురేఖ వెళ్లి చాలా రోజులు అయ్యింది. చిరంజీవి, చరణ్... ఇద్దరూ కామ్రేడ్ డ్రస్‌లలో ఉన్నప్పుడు ఆ షూట్ చేశారు. అప్పటి ఫొటో ఇప్పుడు బయటకు రావడం వెనుక కారణం ఏంటంటే... బర్త్ డే!
సురేఖ పుట్టినరోజు ఈ రోజు (ఫిబ్రవరి 18). ఈ సందర్భంగా తల్లిదండ్రులతో దిగిన ఫొటోను సోషల్ మీడియా ఖాతాల్లో రామ్ చరణ్ పోస్ట్ చేశారు. "నీకు తెలిసినంతగా నా గురించి ఎవరికీ తెలియదు. హ్యాపీ బర్త్ డే మా" అని ఆయన పేర్కొన్నారు.
సురేఖకు సినిమా సెట్స్, షూటింగ్స్ కొత్త ఏమీ కాదు. తండ్రి అల్లు రామలింగయ్య నటులు కావడంతో ఆమెకు సినిమా వాతావరణం అలవాటే. భర్త చిరంజీవి మెగాస్టార్. ఆయన సినిమా షూటింగులకు కూడా వెళ్ళారు. తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా షూటింగ్స్ కూడా చూశారు. అయితే... ఇద్దరూ కలిసి నటిస్తున్నప్పుడు చూడటం ఆమెకు స్పెషల్ మొమెంట్ అయ్యి ఉంటుంది.
Also Read: ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న 'సన్ ఆఫ్ ఇండియా' థియేటర్లు! మ్యాట్నీ షోస్ 100 క్యాన్సిల్
View this post on Instagram
ఇక, 'ఆచార్య'కు వస్తే... కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 29న సినిమా విడుదల కానుంది.
Also Read: సమంత - పూజా హెగ్డే మధ్య గొడవ ముగిసినట్టేనా!?