Ram Charan: కూతురు క్లింకారాకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్ - ఆ బహుమతికి ‘మగధీర’తో లింక్ ఉంది, ఏంటో చెప్పుకోండి!
Ram Charan's New Gift To Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లింకారకి సూపర్ గిఫ్ట్ ఇచ్చారు రామ్ చరణ్. ఆ గిఫ్ట్ కి 'మగధీర' సినిమాతో కనెక్షన్ ఉందని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఏంటా గిఫ్ట్?
Ram Charan's new gift to his daughter Klin Kaara has a Magadheera connect: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన గారాలపట్టి క్లింకారకి సూపర్ గిఫ్ట్ ఇచ్చారట. ఒక వాహన బ్రాండ్ కి సంబంధించిన ఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్ ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆ గిఫ్ట్ 'మగధీర'కి సినిమాకి సంబంధం ఉందని చెప్పారు రామ్ చరణ్. క్లింకారకి కూడా తన లాగా జంతువులంటే ఇష్టమని చెప్పారు. తన కూతురు అప్పుడే ఆ గుర్రంతో ఆడుకుంటోంది రామ్ చరణ్. మరి రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మగధీర సినిమాకి దానికి ఏంటి లింక్ ?
రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే..
హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో రామ్ చరణ్ తనకు జంతువులపై ఉన్న ఇష్టం గురించి చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కూతురికి కూడా తనలానే జంతువులంటే ఇష్టం అని చెప్పారు. “నాకు జంతువులంటే చాలా ఇష్టం. వాటిని ప్రేమిస్తున్నాను. నా ఫామ్ హౌస్ లో 15 గుర్రాలు ఉన్నాయి. అవి నా మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి. 'మగధీర' సినిమాలో నేను బాద్షా అనే గుర్రంపై సవారి చేశాను. షూటింగ్ పూర్తైన తర్వాత రాజమౌళిని అడిగి దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను. ఆ గుర్రానికి ఈ మధ్యే పాప పుట్టింది. నేను ఆ చిన్ని గుర్రాన్ని నా కూతురు క్లింకారకి గిఫ్ట్ గా ఇచ్చాను. ఆమె చాలా చిన్నది అయినా కూడా గుర్రం పిల్లతో ఆడుకుంటోంది. నా అభిరుచే నా కూతురికి కూడా వచ్చింది” అని చెప్పారు రామ్ చరణ్.
గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం..
రామ్ చరణ్ కి గుర్రపు స్వారీ అన్నా, జంతువులన్నా చాలా ఇష్టం. ఇక 'మగధీర' సినిమాలో కూడా ఆయన గుర్రపు స్వారీని అదరగొట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సూపర్ హిట్ అయ్యింది. రామ్ చరణ్ కెరీర్ లో ఇది సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ ప్లే చేశారు. బైక్ రేసర్ హర్ష పాత్ర పోషించారు. దాంతో పాటు కాల భైరవ పాత్రలో నటించారు. ఆ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వానీ, ఎస్ జే సూర్య, సముద్రఖని, అంజలి, జయరామ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆ సినిమాతో పాటు బుచ్చి బాబు డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు. అది పూర్తి కామెడీ జోనర్ లో ఉంటుందని రామ్ చరణ్ ఒక ఈవెంట్ లో చెప్పారు. ఆ సినిమాలో జాన్వీ కపూర్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటుగా.. సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయనున్నారు.
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘సూపర్’ బ్యూటీ అయేషా టకియా - దెబ్బకు ఇన్‌స్టా అకౌంట్ డిలీట్!