Ram Charan: ‘ఓటు’ కోసం షూటింగ్ ఆపేసిన చరణ్, ఇంటికి తిరుగు ప్రయాణం
తన అప్‌కమింగ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ షూట్‌ను నిలిపివేసి మరీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు రామ్ చరణ్.
నవంబర్ 30న తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ సందర్భంగా ఔట్‌డోర్‌కు షూటింగ్‌కు వెళ్లిన నటీనటులంతా తిరిగి ఇంటి బాటపట్టారు. ఎంత నటీనటులు అయినా ముందుగా ఒక పౌరుడు అని నిరూపించడం కోసం సినీ సెలబ్రిటీలు బయల్దేరారు. ప్రస్తుతం చాలావరకు టాలీవుడ్ హీరోలు ఔట్‌డోర్ షూటింగ్‌లోనే ఉన్నారు. అందులో రామ్ చరణ్ కూడా ఒకరు. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్ చరణ్.. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తిరిగి హైదరాబాద్ బయల్దేరాడు. అదే క్రమంలో ఎయిర్‌పోర్ట్ స్టాఫ్‌తో ఫోటోలు కూడా దిగాడు.
మైసూరు నుంచి ఇంటికి..
ఈరోజుల్లో తెలుగు హీరో.. ఇతర భాషా డైరెక్టర్లతో కలిసి పనిచేయడం కొత్త ట్రెండ్‌గా మారింది. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ చెప్పిన కథకు రామ్ చరణ్ ఓకే చెప్పాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ అనేది ఒక పొలిటికల్ డ్రామా అని మూవీ ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. అంతే కాకుండా ఈ ఫస్ట్ లుక్‌లో ఓటు గురించి ముఖ్యంగా చూపించారు. ఇలాంటి ఒక సినిమా తెరకెక్కుతున్న సమయంలోనే ‘రామ్ చరణ్’ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి మైసూరులోని షూటింగ్ వదిలి వస్తున్నారని తన ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.
ఫ్లాప్ జోడీ రిపీట్..
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వినయ విధేయ రామ’ చిత్రం రాగా.. అది భారీ డిసాస్టర్‌గా నిలిచింది. అయినా కూడా కియారా.. ‘గేమ్ ఛేంజర్’లోని పాత్రగా సరిగా సరిపోతుందని భావించిన మూవీ టీమ్ తనను ఈ సినిమాలో క్యాస్ట్ చేసుకుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అంజలి.. మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ గురించి పలు పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఈ మూవీలో డబుల్ రోల్ చేస్తున్నాడు అనేది కూడా అందులో ఒకటి. అది తండ్రి, కొడుకుల పాత్రలే అయ్యుండొచ్చని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
రూ.400 కోట్ల బడ్జెట్‌తో..
దర్శకుడు శంకర్.. ‘గేమ్ ఛేంజర్’తో పాటు ‘ఇండియన్ 2’ షూటింగ్‌ను కూడా కొనసాగిస్తున్నాడు. కమల్ హాసన్‌తో కలిసి తాను తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘భారతీయుడు’ సీక్వెల్‌ను ‘గేమ్ ఛేంజర్’తో పాటు షూట్ చేయాలని శంకర్ నిర్ణయించుకున్నాడు. ‘ఇండియన్ 2’ సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో పలు ఇబ్బందులు రావడంతో ముందుగా ‘గేమ్ ఛేంజర్’ను పూర్తి చేయాలనుకున్నాడు శంకర్. కానీ అంతలోనే ‘ఇండియన్ 2’ షూటింగ్‌కు తాను సిద్ధమని కమల్ హాసన్ ముందుకొచ్చారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను ఒకేసారి మ్యానేజ్ చేస్తున్నాడు ఈ స్టార్ దర్శకుడు. తన ప్రతీ సినిమాను భారీ బడ్జెట్‌లో ప్లాన్ చేసే శంకర్.. ‘గేమ్ ఛేంజర్’ కోసం కూడా రూ.400 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. అందులో ఒక పాట కోసమే దాదాపుగా రూ.100 కోట్లు ఖర్చు అయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
Also Read: నటుడు విజయ్ కాంత్ ఆరోగ్యం విషమం, ఇదీ డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply