Chikiri Chikiri Song : చరణ్ 'చికిరి చికిరి'కి రికార్డు వ్యూస్ - ట్రెండింగ్‌లో 'పెద్ది' సాంగ్... లిరిక్స్‌కు మాస్ ఆడియన్స్ ఫిదా
Peddi First Single : రామ్ చరణ్ పెద్ది మూవీ నుంచి చికిరి చికిరి సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. కేవలం 24 గంటల్లోనే రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది.

Ram Charan's Peddi Chikiri Chikiri Song Creates All Time Indian Records : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అవెయిటెడ్ స్పోర్ట్ యాక్షన్ డ్రామా 'పెద్ది' నుంచి చికిరి చికిరి సాంగ్ ట్రెండ్ సృష్టిస్తోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఇండియన్ సినిమా చరిత్రలో రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకూ ఏ పాటకు రాని విధంగా రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది.
ఆ రికార్డులు బ్రేక్
పెద్ది 'చికిరి చికిరి' ఒక్క రోజులోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని అరుదైన ఘనత సొంతం చేసుకుంది. భారతీయ సినిమా చరిత్రలో 24 గంటల్లోనే ఇన్ని ఎక్కువ వ్యూస్ సాధించిన ఫస్ట్ సాంగ్‌గా నిలిచింది. గతంలో 24 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్ సాధించిన సాంగ్ రికార్డులను కేవలం 13 గంటల్లోనే బద్దలు కొట్టింది. చరణ్ హుక్ స్టెప్స్‌తో పాటు ఉత్తరాంధ్ర స్టైల్ లిరిక్స్‌కు మాస్ ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వేరే లెవల్‌లో ఉంది.
ఈ పాటకు బాలాజీ లిరిక్స్ అందించగా... మోహిత్ చౌహాన్ పాడారు. 'ఆ చంద్రుల్లో చుక్క... జారిందే దీనక్క... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా... ఓ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ...' అంటూ సాగే లిరిక్స్ మాస్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ముఖ్యంగా చరణ్ సిగ్నేచర్ షాట్‌తో వేసిన హుక్ స్టెప్ అదిరిపోయిందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొండల్లో పక్కా మాస్ రోల్‌తో బ్యాట్ పట్టుకుని తన చికిరి కోసం హీరో వేసిన స్టెప్పులు, జోష్, లిరిక్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి.
Also Read : రాజీవ్‌కు యాక్సిడెంట్... ఆ కలలు నిజమయ్యాయి - డివోర్స్ ప్రచారంపై యాంకర్ సుమ స్ట్రాంగ్ రియాక్షన్
మూవీలో చరణ్ సరసన అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ స్పోర్ట్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా మూవీ రూపొందుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.






















