Ram Charan On RC 16 : 'రంగస్థలం'లో చిట్టిబాబును మించి - ఒక్క మాటతో హైప్ పెంచేసిన రామ్ చరణ్
'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఒక్క మాటతో ఆ సినిమా మీద రామ్ చరణ్ హైప్ మరింత పెంచేశారు.
కథానాయకుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రయాణంలో ఎన్నో విజయాలు ఉన్నాయి. వసూళ్లకు లోటు ఏమీ లేదు. కమర్షియల్ సినిమాలు చేస్తూ... నటుడిగానూ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు చరణ్. 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలతో నటుడిగా మరింత ఎత్తుకు ఎదిగారు. ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమాలో మరో పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ చేస్తున్నాని ఆయన పేర్కొన్నారు.
ఒక్క మాటతో హైప్ పెంచేసిన చరణ్
'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చి బాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతుందని ఆయన తెలిపారు. అంతే కాదు... అందులో తనది పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అన్నారు. 'రంగస్థలం' కంటే బెటర్ సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్ అని ఇండియా కాన్‌క్లేవ్‌లో రామ్ చరణ్ తెలిపారు.
నటుడిగా రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యారెక్టర్లలో 'రంగస్థలం' సినిమాలో చిత్తుబాబు క్యారెక్టర్ ముందు వరుసలో ఉంటుంది. దాని కంటే బెటర్ క్యారెక్టర్ అని చెప్పడంతో... ఆ ఒక్క మాటతో సినిమాపై మరింత హైప్ పెంచేశారు ఆయన. ఆ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ (ఫారినర్స్)ను కూడా ఆకట్టుకుంటుందని రామ్ చరణ్ తెలిపారు.
'రంగస్థలం' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. సానా బుచ్చి బాబు ఆయన శిష్యుడే. 'ఉప్పెన' సినిమాతో భారీ విజయం అందుకున్నారు. తొలి సినిమాతో వంద కోట్లు వసూలు చేసిన సినిమాలు తీసిన దర్శకుల జాబితాలో చేరారు. ఆ సినిమా వెనుక సుకుమార్ అండదండలు ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా చేయబోయే సినిమాకు కూడా అండదండలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే... తొలుత ఈ కథను ఎన్టీఆర్ హీరోగా చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో రామ్ చరణ్ దగ్గరకు వచ్చింది. దాని కంటే ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య ఆ విషయమై డిస్కస్ చేసుకున్నారట.
సతీష్ కిలారు నిర్మాణంలో...
రామ్ చరణ్ - సానా బుచ్చి బాబు సినిమాతో సతీష్ కిలారు (Satish Kilaru) నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
Also Read : టామ్ క్రూజ్ సినిమాతో రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ?
ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... కొరటాల శివ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. 'దిల్' రాజు, శిరీష్ నిర్మాతలుగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేసిన రామ్ చరణ్, దాంతో పాటు బుచ్చి బాబు సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి!
Also Read : రామ్ చరణ్‌కు అమిత్ షా సత్కారం - ఇండియన్ సినిమా లెజెండ్ చిరంజీవి అంటూ...