Ram Charan - Uttarandhra : ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేసిన రామ్ చరణ్ - ఎందుకంటే?
Ram Charan Buchi Babu Sana Movie : రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించింది.
![Ram Charan - Uttarandhra : ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేసిన రామ్ చరణ్ - ఎందుకంటే? Ram Charan New Movie RC 16 Update, He will be speaking in an Uttarandhra accent In Buchi Babu Sana direction Ram Charan - Uttarandhra : ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేసిన రామ్ చరణ్ - ఎందుకంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/25/9e64c8ea7d13b49663b6842aadb6a4081682394830810313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సినిమా సినిమాకూ కొత్తదనం చూపించాలని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు. తాను చేయబోయే ప్రతి క్యారెక్టర్, సినిమాలో సంథింగ్ స్పెషల్ ఉండేలా చూసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ చేంజర్' (Game Changer Movie) చిత్రీకరణలో ఉంది.
'గేమ్ చేంజర్' తర్వాత 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చి బాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దాని కోసం ఉత్తరాంధ్ర యాస మీద రామ్ చరణ్ ఫోకస్ చేశారట.
ఉత్తరాంధ్ర యువకుడిగా రామ్ చరణ్!
రామ్ చరణ్, బుచ్చి బాబు సానా సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అది స్పోర్ట్స్ డ్రామా జానర్ ఫిల్మ్. అందులో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఆ సినిమా కోసమే ఇప్పుడు ఆయన ఆ యాస మీద దృష్టి సారించారు. 'రంగస్థలం'లో గోదావరి యాస మాట్లాడారు. అప్పుడు చరణ్ చూపించిన పర్ఫెక్షన్ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. మరి, ఉత్తరాంధ్ర యాస ఎలా ఉంటుందో చూడాలి!
రెహమాన్ సంగీతంలో రామ్ చరణ్ 16?
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్టు టాలీవుడ్ టాక్. కొన్ని రోజులుగా ఆయన పేరు వినబడుతోంది. ఇటీవల చర్చలు పూర్తి అయ్యాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. సాధారణంగా సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. అందులో మరో సందేహం లేదు. ఆయన శిష్యుల సినిమాలకూ దేవి సంగీతం అందిస్తూ వస్తున్నారు. అంత ఎందుకు? 'ఉప్పెన' సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. పాన్ ఇండియా అనుకున్నారో? కథకు రెహమాన్ అయితే బావుందని భావించారో? ఆయన్ను సంప్రదించారు బుచ్చిబాబు.
సెప్టెంబర్ నుంచి షూటింగ్ షురూ!
ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతుందని రామ్ చరణ్ గతంలో తెలిపారు. ఇందులో తనది పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అన్నారు. 'రంగస్థలం' కంటే బెటర్ సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్ అని ఇండియా కాన్‌క్లేవ్‌లో రామ్ చరణ్ తెలిపారు.
Also Read : విజయ్ వర్మతో తమన్నా - అవును, వాళ్ళిద్దరూ మళ్ళీ దొరికేశారు!
నటుడిగా రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యారెక్టర్లలో 'రంగస్థలం' సినిమాలో చిత్తుబాబు క్యారెక్టర్ ముందు వరుసలో ఉంటుంది. దాని కంటే బెటర్ క్యారెక్టర్ అని చెప్పడంతో... ఆ ఒక్క మాటతో సినిమాపై మరింత హైప్ పెంచేశారు ఆయన. ఆ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ (ఫారినర్స్)ను కూడా ఆకట్టుకుంటుందని రామ్ చరణ్ తెలిపారు.
సతీష్ కిలారు నిర్మాణంలో...
రామ్ చరణ్ - సానా బుచ్చి బాబు సినిమాతో సతీష్ కిలారు (Satish Kilaru) నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
Also Read : సల్మాన్ మార్కెట్ పదేళ్ళు వెనక్కి - ఫస్ట్ డే మరీ ఇంత ఘోరమా!?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)