అన్వేషించండి

Ram Charan : పారిస్‌లో రామ్ చరణ్ - అక్కడికి ఎందుకు వెళ్ళారంటే?

రామ్ చరణ్ ప్రస్తుతం పారిస్ లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి అక్కడ ఓ వెడ్డింగ్ కి అటెండ్ అయ్యారు. ఈ వెడ్డింగ్ లో రామ్ చరణ్ దిగిన ఓపిక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ అందుకుంది. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' సినిమాలో నటిస్తున్నాడు. 'ఆర్ఆర్ఆర్'తో కెరియర్ పరంగా చరణ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆ గ్రాఫ్ ని మరింత పెంచుకునేందుకు వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే... కొద్ది రోజుల క్రితమే రామ్ చరణ్ తండ్రి అయిన సంగతి తెలిసిందే. చరణ్ భార్య ఉపాసన జూన్ నెలలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమెకి 'క్లింకారా' అని నామకరణం చేశారు.

ఇక పాప పుట్టిన తర్వాత మొదటిసారి ఇటీవల విదేశాలకు వెళ్లారు చరణ్ - ఉపాసన. ప్రస్తుతం ఈ జంట ఫారిన్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ - ఉపాసన ఫారిన్ టూర్ కి వెళుతుండగా ఎయిర్ పోర్టులో మీడియా కంటపడ్డారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ తర్వాత ఫారిన్ వెళ్ళాక ఉపాసన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ చేసింది. దాన్ని బట్టి ఈ జంట పారిస్ వెళ్ళినట్టు తెలిసింది. మరో పోస్ట్ లో ఉపాసన వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ ను బట్టి ఫ్యారిస్ లో మ్యారేజ్ కి వెళ్లారని అర్థమవుతుంది.

అయితే తాజాగా ఈ వెడ్డింగ్ ఫంక్షన్ లో రామ్ చరణ్ దిగిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పిక్ లో రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. ఈ వెడ్డింగ్ లో రామ్ చరణ్ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ఫరాజ్ మనన్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన లేత గోధుమ రంగు సూట్ ని ధరించాడు. సిగ్నేచర్ హెయిర్ డో, డోల్డెన్ ఫినిషింగ్ తో కూడిన బ్లాక్ వెల్వెట్ షూస్, సన్ గ్లాసెస్, గోల్డెన్ వాచ్ ధరించి ఆ వెడ్డింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్రస్తుతం ఈ పిక్ నెటిజన్స్ తో పాటు ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా ఈ వెడ్డింగ్ కు సంబంధించి ఉపాసన తన సోషల్ మీడియాలో ఇంకెలాంటి విషయాలను వెల్లడించకపోవడం గమనార్హం.

Also Read : కళ్యాణ్ రామ్ 'డెవిల్'తో దర్శకుడిగా మారిన నిర్మాత - తెర వెనుక ఏం జరిగింది?

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఫ్యారిస్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న చరణ్ తిరిగి వచ్చిన తర్వాత 'గేమ్ చేంజర్' చివరి షెడ్యూల్ షూటింగ్లో జాయిన్ కానున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో తన తదుపరి మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు చరణ్. 'RC16' అనే వర్కింగ్ టైటిల్తో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.

Also Read : త్వరలో రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి - కన్ఫర్మ్ చేసిన సురేష్ బాబు, అమ్మాయి ఎవరో తెలుసా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget