అన్వేషించండి

RRR Behind and Beyond OTT Streaming: రామ్ చరణ్ ఇంట్రడక్షన్ షాట్ సీజీ కాదు, రియల్... 'ఆర్ఆర్ఆర్'లో జక్కన్న ఎలా తీశాడో తెలుసా?

RRR Behind And Beyond : 'ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అందులో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ గురించి జక్కన్న షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

దర్శక దిగ్గజం రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా గ్లోబల్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను అల్లాడించిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన డాక్యుమెంటరీని తాజాగా ఓటీటీలో రిలీజ్ చేశారు. అందులో జక్కన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అందులోనూ 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ ఇంట్రో సీన్ లో వచ్చిన ఓ సన్నివేశం సీజీ వర్క్ కాదని చెప్పి షాక్ ఇచ్చారు జక్కన్న. "ఆ సీన్ సీజీ కాదు.. రియల్" అంటూ జక్కన్న చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

చెర్రీ ఇంట్రో సీన్ సీజీ కాదు 
వైరల్ వీడియోలో జక్కన్న మాట్లాడుతున్నది 'ఆర్ఆర్ఆర్' మూవీలోని రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ గురించి. 'ఆర్ఆర్ఆర్' మూవీ మొదట్లోనే స్వాతంత్రం కోసం పోరాడుతూ పోలీస్ స్టేషన్ పై దాడికి వచ్చిన చాలామందిని రామ్ చరణ్ ఒక్కడే హ్యాండిల్ చేస్తాడు. ఈ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో అంతమందిని ఆపడం ఆ పోలీసుల వల్ల కాదు. కానీ వారిలో ఒకరైన రామ్ మాత్రం అందరినీ చాకచక్యంగా ధైర్యంతో ఎదుర్కొంటాడు. ఈ సీన్ సినిమాలోని హైలెట్స్ లో ఒకటి. ఇక రామ్ ని చూసి భయపడి, ఆ జనసందోహం అంతా ఒక్కసారిగా వెనక్కి జరుగుతుంది. ఈ సీన్ ను చెర్రీ కన్ను లోపల నుంచి చూస్తాము మనం. అయితే ఇలాంటి సీన్స్ ను నిజానికి మేకర్స్ సీజీ వర్క్ ద్వారా క్రియేట్ చేస్తారు. కానీ జక్కన్న మాత్రం టాలెంట్ ని ఉపయోగించి ఆ సీన్ ని రియల్ గానే చిత్రీకరించారట. తాజాగా 'ఆర్ఆర్ఆర్ : బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అలాగే చెర్రీ కన్నుకు దగ్గరగా కెమెరాను పెట్టి ఆ సీన్ ను ఎలా తీశారో వివరించారు. ఇలా డాక్యుమెంటరీలో సినిమా గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 

ఓటీటీలోకి 'ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్'
మాగ్నం ఓపస్ 'ఆర్ఆర్ఆర్' మూవీని ఇప్పటికే తెరపై చూసి ప్రేక్షకులు ఆనందించారు. కానీ తెర వెనుక సీన్లను చూడడం దాదాపు అసాధ్యమైన పని. ఎందుకంటే తెర వెనుక సీన్ల గురించి ఇప్పటిదాకా ఎవ్వరూ పెద్దగా ఆలోచించలేదు, పట్టించుకోలేదు. కానీ జక్కన్న తాజాగా 'ఆర్ఆర్ఆర్' సినిమాకి సంబంధించిన బిహైండ్ సీన్స్ తో ఏకంగా ఒక డాక్యుమెంటరీనే రిలీజ్ చేసి కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ డాక్యుమెంటరీ రిలీజ్ టైం రానే వచ్చింది. ఇండియా వైడ్ గా ఈ డాక్యుమెంటరీ డిసెంబర్ 20న పలు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఒక గంట 37 నిమిషాల రన్ టైంతో సాగే ఈ డాక్యుమెంటరీలో 'ఆర్ఆర్ఆర్' సినిమాను రూపొందించిన బిహైండ్ ది సీన్స్ కంటెంట్ కు థియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇక ఈ డాక్యుమెంటరీ తాజాగా దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫిక్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 

ప్రస్తుతం నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీలో సినిమా కోసం తారక్, రామ్ చరణ్, రాజమౌళి అండ్ టీం ఎంతలా కష్టపడ్డారో చూపించారు. ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన 'ఆర్ఆర్ఆర్ ' మూవీ 2021లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. అంతేకాదు ఆస్కార్ అవార్డును గెలుచుకుని చరిత్రను సృష్టించింది. తాజాగా రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీ కొత్త దర్శకులకు స్ఫూర్తిగా నిలవబోతోంది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ కీలకపాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

Read Also : Janhvi Kapoor : బాయ్​ఫ్రెండ్​తో జాన్వీకపూర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్​.. బాడీకాన్ డ్రెస్​లో డైమండ్ నెక్లెస్​తో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
BJP Leader Annamalai : డీఎంకేను గద్దె దించే దీక్ష చేపట్టిన అన్నామలై - కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
డీఎంకేను గద్దె దించే దీక్ష చేపట్టిన అన్నామలై - కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
Embed widget