Mega 156 Villain : చిరంజీవికి విలన్‌గా రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఫాంటసీ సినిమా దసరాకు పూజతో మొదలైంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో విలన్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్ అట!
Rana Daggubati to play villain role in Mega 156 : మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. విజయ దశమి సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో విలన్ రోల్ కోసం చరణ్ స్నేహితుడిని సంప్రదించారట.
మెగా 156లో రానా దగ్గుబాటి?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్, రానా దగ్గుబాటి క్లోజ్ ఫ్రెండ్స్. ఈ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు చరణ్ ఫ్రెండ్ రానాను చిరంజీవి సినిమాలో విలన్ రోల్ కోసం సంప్రదించారని టాక్.
Also Read : జైల్లో రజనీకాంత్ 'జైలర్' విలన్ వినాయకన్ - మద్యం మత్తులో గొడవ గొడవ
చిరు తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'లో రానా నటించారు. ఆ సినిమాలో ఆయనది విలన్ రోల్ అని చెప్పలేం! హీరోతో సమానమైన పాత్ర అని చెప్పాలి. ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ సినిమాలో రానా కీలక పాత్ర చేసే అవకాశం అందుకున్నారు. ఒక వైపు హీరోగా చేస్తూ... మరో వైపు కథలో బలమైన పాత్రలు వస్తే చేయడానికి ఆయన 'ఎస్' చెబుతున్నారు.
Also Read : భజన ఆపేసి మంచి సినిమా తీయండి సార్... స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హరీష్ - పవన్ 'ఉస్తాద్' అప్డేట్ కూడా!
మెగా 156 మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు!
సినిమాకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయడం అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితీ. మళ్ళీ ఆ సంప్రదాయాన్ని మెగా 156 చిత్ర బృందం తీసుకు వచ్చింది. ఆస్కార్ పురస్కార గ్రహీతలైన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్... దర్శకుడు వశిష్ఠ, చిరంజీవి మధ్య చర్చలు జరిగాయి.
View this post on Instagram
సినిమాలో మొత్తం ఆరు పాటలు
మెగాస్టార్ 156వ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయని సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు. పూజ తర్వాత సాంగ్స్ రికార్డ్ చేయడమనే పద్ధతిని మళ్ళీ ఈ సినిమాతో తీసుకు వస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. సెలబ్రేషన్ సాంగ్ రికార్డ్ చేస్తున్నామని వివరించారు. దర్శకుడు వశిష్ఠతో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అద్భుతమైన సినిమాలో తాను కూడా ఒక భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రబోస్ చెప్పారు.
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, సంగీతం : ఎంఎం కీరవాణి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial