News
News
వీడియోలు ఆటలు
X

రౌడీ బాయ్ ఫ్యాన్స్‌పై రామ్ చరణ్ ప్రశంసల వర్షం - దేవరకొండకు స్పెషల్ విసెష్!

హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రామ్ చరణ్..విజయ్ అభిమానుల్ని ప్రశంసించారు. ఇది వైరల్ గా మారింది.

FOLLOW US: 
Share:

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా పలువురు స్టార్ హీరోస్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. అందులో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాంతో పాటు ఆయన ఫ్యాన్స్ చేసిన ఓ పనిని మెచ్చుకుంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

హీరో విజయ్ దేవరకొండ బర్త్ డేను పురస్కరించుకుని ఫ్యాన్స్ పలు రకాలుగా ఆయనకు పుట్టిన రోజు విషెస్ తెలియజేస్తున్నారు.  కొందరు అభిమానులు తమ ఫేవరేట్ యాక్టర్ పుట్టినరోజును మరింత స్పెషల్ డే మార్చారు. అందులో భాగంగా విజయ్ ఫ్యాన్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేశారు. దీంతో ఆయన అభిమానులతో పాటు, విజయ్ ను కూడా పొగుడుతున్నారు. ఇంతమంచి ఫ్యాన్స్ ను సంపాదించినందుకు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. 

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విజయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌'లో రక్తదానం చేసిన మీ అభిమానులను నిజంగా అభినందిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్ కు విజయ్ దేవరకొండ కూడా రిప్లై ఇచ్చారు. ‘థాంక్యూ అన్న’ అంటూ ట్వీట్ చేశారు. తన అభిమానులు ఎప్పుడూ తనను గర్వపడేలా, సంతోషంగా ఉండేలా చేస్తారని అన్నారు. తన అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ చేసిన కామెంట్లు.. వాళ్లు వింటే ఎంతో సంతోషిస్తారని ట్వీట్ లో పేర్కొన్నారు. వీరిద్దరి ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా.. రామ్ చరణ్ తో పాటు ఆయనకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంచు లక్ష్మి, గోపీచంద్ మలినేని, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సుధాకర్ కోమాకుల, దర్శకుడు రాధాకృష్ణ, హరీష్ శంకర్, సమంత లాంటి తదితరులు ట్విట్టర్ ద్వారా విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఫ్యాన్స్ అంటే ఎంతో ప్రేమ చూపించే విజయ్ దేవరకొండ ఈ సారి తన బర్త్ డేకి ‘ది దేవరకొండ బర్త్‌డే ట్రక్’ను తీసుకొచ్చారు. ఈ ట్రక్ ద్వారా అందరికీ ఉచితంగా ఐస్ క్రీమ్‌లు పంచుతున్నారు. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే, ఢిల్లీలో ఈ ట్రక్‌ను తిప్పుతూ అందరికీ ఐస్ క్రీమ్‌లు ఉచితంగా పంచుతున్నారు. ఇక తాను నెలకొల్పిన గార్మెంట్ బ్రాండ్ ‘రౌడీ’కి కూడా ఆయన పుట్టినరోజు సందర్బంగా స్పెషల్ ఆఫర్లు ప్రకటించారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా నేడు ‘ది రౌడీ బర్త్‌డే బాష్ సేల్’ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కస్టమర్లకు 60 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. 

విజయ్ దేవరకొండ సినిమా విషయాలకొస్తే ప్రస్తుతం ఆయన సమంతతో కలిసి ‘ఖుషి’తో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ఈ మూవీలోని ‘నా రోజా నువ్వే’ అనే అందమైన మెలోడి సాంగ్ ను మేకర్స్ విడుదల చేయగా.. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

Also Read 'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?   

Published at : 09 May 2023 09:44 PM (IST) Tags: fans Vijay Deverakonda Birthday Khushi Ram Charan chiranjeevi blood bank

సంబంధిత కథనాలు

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం