అన్వేషించండి

'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగిల్ అప్డేట్: లీకైన పాటనే అఫిషియల్ గా రిలీజ్ చేస్తున్నారుగా!

శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. దసరా సందర్భంగా చిత్ర బృందం మ్యూజికల్ అప్డేట్ అందించారు.

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్‌ షణ్ముగం దర్శకత్వంలో వహిస్తున్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. పవర్‌ ఫుల్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్ లో చెర్రీ తండ్రీకొడులుగా రెండు విభిన్నమైన లుక్స్‌ లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మెగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే చాలా కాలంగా మరో అప్డేట్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ తో వచ్చారు. 

‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా నుంచి 'జరగండి' అనే పాటను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 'సెలబ్రేట్ చేసుకోడానికి ఇంకా చాలా ఉన్నాయి.. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఎలక్ట్రిఫైయింగ్ ఫస్ట్ సింగిల్ ఈ దీపావళికి మీ ముందుకు రాబోతోంది' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ పోస్టర్ ను పంచుకున్నారు. ఇందులో కలర్ ఫుల్ డ్రెస్ లో ఉన్న రామ్ చరణ్ బ్యాక్ సైడ్ లుక్ ని మాత్రమే చూపించారు. అతని చేతిలో బుక్, మరో చేతికి కడియం, చెవి పోగును మనం గమనించవచ్చు. బ్యాగ్రౌండ్ సెటప్ అంతా చూస్తుంటే ఇది శంకర్ స్టైల్ లో భారీ స్కేల్ లో చిత్రీకరించిన సాంగ్ అని స్పష్టమవుతోంది. 

నిజానికి కొన్ని రోజుల ముందు ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా నుంచి ఆన్ లైన్ వేదికగా ఓ సాంగ్ లీకైన సంగతి తెలిసిందే. ‘జరగండి జరగండి.. జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చెనండీ’ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. లిరిక్స్ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. ఏదో ఒకటీ రెండు లైన్స్ కాకుండా ఏకంగా బేసిక్ వెర్షన్ ఫుల్ సాంగ్ బయటకు రావడం అందరినీ షాక్ కు గురి చేసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న మేకర్స్.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. లీక్ చేసిన వారిపైనే కాదు.. ఈ పాటను వాట్సాప్‌ తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వారిపైనా చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు. 

అయితే అప్పుడు లీకైన 'జరగండి' పాటనే ఇప్పుడు అఫీషియల్ గా రిలీజ్ చేయాలని ‘గేమ్‌ ఛేంజర్‌’ టీమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాకపోతే దానికి థమన్ సౌండింగ్ ని మిక్స్ చేసి ఫ్రెష్ ఫీలింగ్ కలిగించేలా ఫైనల్ వెర్షన్ సాంగ్ ను వదులబోతున్నారని సమాచారం. ఈ పాటను దసరా పండగకే విడుదల చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ.. దర్శక నిర్మాతలు మాత్రం విజయ దశమికి అప్డేట్ ఇచ్చి, దీపావళికి సాంగ్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రామ్ చరణ్, కియారా లపై షూట్ చేసిన ఈ పాట ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్‌ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. తమ బ్యానర్ లో రూపొందే 50వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇందులో ఎస్‌.జె. సూర్య విలన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, జయరామ్, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ సినిమాకు అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అది ఎప్పుడనేది శంకర్ డైరెక్ట్ చేస్తున్న 'ఇండియన్ 2' సినిమా మీద ఆధారపడి ఉంది.

Also Read: ఆసక్తి రేకెత్తిస్తోన్న నాని 'సరిపోదా శనివారం' ఫస్ట్ లుక్ & టైటిల్ గ్లింప్స్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget