అన్వేషించండి

Rajinikanth: చెన్నై వరదల్లో మునిగిన రజనీకాంత్ ఇల్లు - వీడియో వైరల్

తమిళనాడులో వరదలు బీభత్సం సృష్టిస్తుండగా.. చెన్నైలోని రజినీకాంత్ ఇంటిపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. దానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమిళనాడులో ‘మిగ్‌జాం’ తుఫాను వల్ల ఆ రాష్ట్ర రాజధాని చెన్నైపై తీవ్ర ప్రభావం పడింది. అక్కడ ప్రజలు ఇప్పటికీ ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇంటి బయట అడుగుపెడితే నీరు తప్పా ఇంకేమీ లేదు. కొంతమంది ఇళ్లల్లోకి కూడా నీరు కావడంతో వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించింది సహాయక సిబ్బంది. ఇక చెన్నైలోని సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటి ముందు కూడా పూర్తిగా నీరు నిండిపోయిందంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా ‘మిగ్‌జాం’ ఎఫెక్ట్ వల్లే అని ఈ వీడియో అందరికీ షేర్ అవుతోంది.

నీటితో నిండిపోయిన పోస్ గార్డెన్..
చెన్నైలోని పోస్ గార్డెన్ వద్ద ఉండే రజినీకాంత్ ఇల్లు ‘మిగ్‌జాం’ తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయ్యింది. రజినీ ఇంటి ముందు మాత్రమే కాకుండా మొత్తం ఆ స్ట్రీట్ అంతా నీటితో ఎలా నిండిపోయిందో చూపిస్తూ.. ఒక వీడియో వైరల్ అయ్యింది. ప్రస్తుతం రజినీకాంత్.. ఇంట్లో లేరని, ఔట్‌డోర్ షూటింగ్‌కు వెళ్లారని సమాచారం. ‘తలైవార్ 170’ షూటింగ్ కోసం తిరనెల్వెలీ వెళ్లారట సూపర్‌స్టార్. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే రజినీకాంత్ ఉంటున్న పోస్ గార్డెన్ అనేది చెన్నైలోనే ఖరీదైన ఏరియాల్లో ఒకటి. కానీ వరదలు వచ్చినప్పుడు ముందుగా ఎఫెక్ట్ అయ్యే ఏరియా కూడా ఇదే. 

సెలబ్రిటీల ఆర్థిక సాయం..
గత కొన్నిరోజులుగా తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో నిండిపోయిన నీటిని, ఆ నీటిలో చిక్కుకుపోయిన ప్రజలను కాపాడడానికి అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. వారికి ఆర్థిక సహాయం అందించడానికి పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ముందుకొచ్చారు. ముందుగా కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీ.. రూ.10 లక్షలను ఆర్థిక సాయంగా అందించారు. తన ఫ్యాన్స్ కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా అమీర్ ఖాన్, విష్ణు విశాల్ లాంటి స్టార్ హీరోలు కూడా చెన్నై వరదల్లో చిక్కకుపోయారు. తన ఫోన్‌లో సరిగా సిగ్నల్ లేదంటూ, ఇంట్లోనే కాదు.. తాము ఉంటున్న స్ట్రీట్ మొత్తం నీటితో నిండిపోయిందంటూ విష్ణు విశాల్.. ట్విటర్ ద్వారా బయటపెట్టాడు. దీంతో సహాయక సిబ్బంది కాసేపటిలోనే అక్కడికి చేరుకొని తనతో పాటు తన భార్య జ్వాలా గుత్తాను, తమ ఇంట్లోనే ఉంటున్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌ను రక్షించారు.

కూతురి దర్శకత్వంలో..
ఇక రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే.. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజినీ. చాలారోజుల తర్వాత రజినీకి కావాల్సిన హిట్‌ను ఇచ్చింది ‘జైలర్’. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్‌ను సాధించడంతో పాటు రూ.650 కోట్ల కలెక్షన్స్‌ను కూడా కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ‘లాల్ సలామ్’ అనే చిత్రంలో రజినీ ఒక గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్న ‘తలైవార్ 170’ పూర్తయిన తర్వాత లోకేశ్ కనకరాజ్‌తో రజినీ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి.

Also Read: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget