News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Rajinikanth: అందుకే చంద్రబాబును కలవలేకపోయా: రజినీకాంత్ - రాజమండ్రి పర్యటన రద్దు

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఆదివారం కలవాలని అనుకున్నారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఆయన రాజమండ్రి పర్యటనను రద్దు చేసుకున్నారు.

FOLLOW US: 
Share:

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును రజినీకాంత్ ఆదివారం కలిసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆయన దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం. అయితే, అనివార్య కారణాల వల్ల రజినీకాంత్ ఆదివారం చంద్రబాబును కలవడానికి వెళ్లలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నేను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును కలవాల్సి ఉండేది. కానీ, ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల వెళ్లలేకపోయాను’’ అని తెలిపారు. 

చంద్రబాబు అరెస్టు వార్త తెలిసిన రోజు నుంచి రజినీకాంత్ నారా లోకేష్‌తో టచ్‌లో ఉన్నారు. ఆయనే స్వయంగా లోకేష్‌కు ఫోన్ చేసి దైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని అన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకి రక్షగా నిలుస్తుందన్నారు రజినీకాంత్. ఇలాంటి సమయంలో లోకేష్ ధైర్యంతో ఉండాలని సూచించారు. ఆయన కచ్చితంగా బయటకు వస్తారని ధీమా వ్యక్తంచేశారు.  

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కేసు నమోదు చేసి జైల్లో పెట్టారని బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు ఇటీవల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కనీసం ఎప్‌ఐఆర్‌లో కూడా తన పేరు లేదని కోర్టుకు తెలియజేశారు. ఏపీఎస్‌డీసీ ఛైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదులో కూడా తన పేరు లేదని గుర్తు చేశారు. రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ కేసులో ఇరికించారని దీన్ని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. రజినీకాంత్ మరొక రోజు చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇక వరుస అపజయాల తర్వాత 'జైలర్' తో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రజినీకాంత్ తదుపరి చిత్రంగా లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాల నెలకొన్నాయి. దానికి తోడు కార్తీ, కమలహాసన్, విజయ్ లాంటి స్టార్స్ కి బ్లాక్ బస్టర్ అందించిన లోకేష్ రజనీకాంత్ కి కూడా గ్యారెంటీగా మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో భారీ డిమాండ్ ఉన్న డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజు ముందు వరుసలో ఉంటారు. అందుకే ఈ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఆసక్తికరపరుస్తున్నారు. 

‘జైలర్’ సీక్వెల్‌లో బాలయ్య?

‘జైలర్‌కు సీక్వెల్ ఉండబోతుందని, అందులో బాలకృష్ణ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం’ అని ఒక జర్నలిస్ట్.. వసంత్ రవిని ప్రశ్నించారు. అయితే ఈ విషయం గురించి తనకు అసలు తెలియదని, తెలుసుకోవాలంటే దర్శకుడు నెల్సన్‌ను అడగాలని సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా సమాధానమిచ్చాడు వసంత్ రవి. అంతే కాకుండా తను తరువాత నటిస్తున్న తెలుగు చిత్రాల గురించి అడగగా.. ‘‘ప్రస్తుతం ‘వెపన్‌’పై ఫోకస్ పెడదాం’’ అని సూటిగా చెప్పేశాడు. మల్టీ స్టారర్ సినిమాలపై కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు వసంత్ రవి.

Also Read: డై హార్డ్ ఫ్యాన్ అంటే ఇతనే - వెంటిలేటర్‌తో థియేటర్‌కు వచ్చి 'జవాన్' సినిమా చూసిన వీరాభిమాని!

Published at : 17 Sep 2023 04:46 PM (IST) Tags: Rajinikanth Chandrababu Naidu Chandra Babu Case Rajinikanth Rajahmundry Visit Rajinikanth Chandra Babu Naidu

ఇవి కూడా చూడండి

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ -  'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !