అన్వేషించండి

Coolie Trailer: డోంట్ కన్ఫ్యూజ్... రజినీకాంత్ 'కూలీ' ట్రైలర్‌ అప్డేట్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Coolie Movie: తలైవా రజినీకాంత్ 'కూలీ' మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. సోషల్ మీడియా వేదికగా వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టారు.

Rajinikanth's Coolie Trailer Release Date: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబో అవెయిటెడ్ మూవీ 'కూలీ'. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఆగస్ట్ 14న మూవీ రిలీజ్ కానుండగా ట్రైలర్ ఎప్పుడు? అనే సస్పెన్స్‌కు మేకర్స్ తాజాగా తెర దించారు.

రూమర్స్‌కు చెక్...

ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడొస్తుంది? ట్రైలర్ రిలీజ్ కాకుండానే సినిమా వచ్చేస్తోందా? అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా రూమర్స్ హల్చల్ చేశాయి. కొందరు మీమ్స్‌తో సెటైరికల్ ట్వీట్స్ చేశారు. తాజాగా... ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ మూవీ టీం క్లారిటీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఆగస్ట్ 2న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. దీంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read: నా జీవితంలో కథే 'మిస్టర్ రెడ్డి'... ఎంతో మంది మోసం చేసినా భయపడకుండా విడుదలకు... - టీఎన్ఆర్

దళపతిలా అనిపించింది

ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఇటీవల రజినీ సార్‌కు మూవీ చూపిస్తే తనను హగ్ చేసుకుని... 'నాకు ఈ చిత్రం దళపతిలా అనిపించింది.' అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారని తెలిపారు. ముందు ఫాంటసీ స్టోరీ రాశానని... మేకింగ్‌కు ఎక్కువ టైం పడుతుందనే ఆ ప్రాజెక్ట్ స్థానంలో 'కూలీ'ని తెరకెక్కించినట్లు చెప్పారు. 'హార్బర్ బ్యాక్ డ్రాప్‌లో స్మగ్లింగ్ నేపథ్యంగా సాగే స్టోరీ ఇది. మూవీ సెట్స్‌లో రోజూ 700 మంది నుంచి 1000 మంది వరకూ పని చేసేవారు.' అని వెల్లడించారు.

సాంగ్స్ ట్రెండింగ్...

ఈ  సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన 'చికిటు', 'మోనికా మై డియర్ మోనికా' సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా 'మోనికా' సాంగ్‌లో బుట్ట బొమ్మ పూజా హెగ్డేతో మలయాళ స్టార్ సౌబిన్ సాహిర్ స్టెప్పులు అదిరిపోయాయి. ఫుల్ గ్రేస్ ఎనర్జిటిక్‌తో సౌబిన్ డ్యాన్స్ సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆయనలో డ్యాన్సర్‌ను లోకేశ్ గుర్తించారని అంటున్నారు.

ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించగా... తలైవాతో పాటు కింగ్ నాగార్జున, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. రజినీకాంత్ 'కూలీ నెం.1421'గా కనిపించనుండగా... నెగిటివ్ రోల్‌లో నాగార్జున నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇటీవలే ఆయన మాస్ లుక్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా... ఐమాక్స్ ఫార్మాట్‌లోనూ మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్ట్ 14న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Power House: క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ కాదు... ఆ ఒక్కటీ సీక్రెట్ - విక్రమ్ 'పవర్ హౌస్' గ్లింప్స్ చూశారా?
క్యాటరింగ్ బిజినెస్ మ్యాన్ కాదు... ఆ ఒక్కటీ సీక్రెట్ - విక్రమ్ 'పవర్ హౌస్' గ్లింప్స్ చూశారా?
Ee Paata Korinavaaru Trailer: రొమాంటిక్‌గా 'ఈ పాట కోరినవారు' ట్రైలర్... అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
రొమాంటిక్‌గా 'ఈ పాట కోరినవారు' ట్రైలర్... అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
Surya Tej: రచయితగా మారిన సూర్య తేజ్... 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' తర్వాత నితిన్ గడ్కరీపై!?
రచయితగా మారిన సూర్య తేజ్... 'నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి' తర్వాత నితిన్ గడ్కరీపై!?
Emmy Awards 2026 Winners: హాలీవుడ్ ఎమ్మీ విన్నర్స్ లిస్ట్... యాపిల్ టీవీ సిరీస్ 'విడోస్ బే' అవార్డుల వేట - మాథ్యూ రైస్ డబుల్ ధమాకా
హాలీవుడ్ ఎమ్మీ విన్నర్స్ లిస్ట్... యాపిల్ టీవీ సిరీస్ 'విడోస్ బే' అవార్డుల వేట - మాథ్యూ రైస్ డబుల్ ధమాకా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
Alla Nani Passes Away: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
Piles Types and Grades : పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
పైల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వాటిలో ఏది ప్రమాదకరం? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Embed widget