(Source: ECI/ABP News/ABP Majha)
Raj Tarun Girlfriend Lavanya: కేసు వెనక్కి తీసుకోమని బెదిరిస్తున్నారు - రాజ్ తరుణ్ విషయమై 'మా' అసోషియన్‌కు వెళ్తా, లావణ్య కామెంట్స్
Raj Tarun - Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. అర్థరాత్రి ఆమె ఆత్మహత్య మెసేజ్ కలకలం రేపింది. తాజాగా లావణ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.
Raj Tarun Girlfriend Lavanya Said She Approach MAA: రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని, రేపు MAA అసోసియేషన్‌కు వెళ్తానంటూ తాజాగా మీడియాతో పేర్కొంది. కాగా కొంతకాలంగా రాజ్ తరుణ్-లావణ్య కేసు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులో ఇటీవల నార్సింగ్ పోలీసులకు ఆధారాలు సమర్పించగా.. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాపై కేసు నమోదైంది. ఇది జరిగిన రెండు రోజుల్లోనే లావణ్య నుంచి ఏపీబీ ప్రతినిథి షాకింగ్ మెసేజ్ చేసింది.
తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఏపీబీ దేశం ప్రతినిథికి అర్థరాత్రి వాట్సప్ మెసేజ్ చేసింది. అయితే ఆమె మెసేజ్‌కి వెంటనే స్పందించిన ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు లావణ్య ఇంటికి వెళ్లి రక్షించారు. లావణ్య సూసైడ్ మెసేజ్ ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. దీంతో ఆమె మెసేజ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆత్మహత్యకు వరకు వెళ్లిన ఆమె ఇప్పుడు తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తానంటుంది. అంతేకాదు రాజ్ తరుణ్ విషయమై మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌ని కూడా కలుస్తానని లావణ్య పేర్కొన్నట్టు సమాచారం.
ఈ మేరక ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. "నా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాను. రాజ్ తరుణ్ నాకు కావాలి. తను లేని ఈ జీవితం నాకు వద్దు. తన కోసమే నేను ఫైట్ చేస్తున్నాను. యూట్యూబ్‌లో నా గురించి అసభ్యకరంగా థంబ్‌నేల్స్ పెడుతునారు. అవి చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. నేను డిప్రెషన్‌లో ఉన్నాను అందుకే చనిపోవాలి అనుకున్న. ఈ కేసు వెనక్కి తీసుకోమని తరచూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నాకు ప్రాణహాని ఉంది. రాజ్ తరుణ్ మేనేజర్, లాయర్ నాతో మాట్లాడారు. రూ. 5 కోట్లు ఇస్తాము ఈ కేసు రిటర్న్ తీసుకోమని ఆఫర్ చేశారు. నాకు రాజ్ తరుణ్ కావాలి. తను నా దగ్గరికి రాకపోతే నేను ప్రాణాలతో ఉండను" అని చెప్పింది.
ఈ కేసు విషయమై న్యాయవాది రాజేష్ వారం రోజుల క్రితం నన్ను కలిశారు. ఈ కేసు నిలవదు అని ఆయన అప్పుడే నాతో అన్నారు. చివరికి నాకు ఏం అర్థమైందంటే కావాలని నాతో పరిచయం పెంచుకోవడమే కోసంఏ లాయర్ రాజేష్ నాతో మాట్టాడారని తెలిసింది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం. మొదట ఫిర్యాదు చేస్తే ఫార్మాట్‌లో లేదన్నారు. రెండోసారి ఆధారాలు అడిగారు. 170 ఫోటోలు, వీడియోలు ఉన్న ఆధారాలు అందించి ఫిర్యాదు చేశాను. ఒక FIR కాపీ మాత్రం ఇచ్చారు. ఈ రోజు నా స్టేట్‌మెంట్ తీసుకుంటామని అన్నారు. కానీ, ఇప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం. రాజ్ తరుణ్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఈ కేసు విషయమై నేను 'మా' అసోసియేష్‌కి వెళ్తాను. అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేస్తాను" అని పేర్కొంది.