అన్వేషించండి

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్‌కు 'కాంచ‌న 4'లో ఛాన్స్... సారీ ఫ్యాన్స్, క్లారిటీ ఇచ్చిన రాఘవా లారెన్స్

'Kanchana 4' Cast: హార‌ర్ కామెడి అన‌గానే గుర్తొచ్చే మొద‌టి సినిమా కాంచ‌న‌. భ‌య‌పెడుతూనే న‌వ్వించాడు రాఘ‌వ లారెన్స్. అందుకే ఆ సిరీస్ కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇప్పుడు 'కాంచన -4' వ‌చ్చేస్తోంది.

Raghava Lawrence gives clarity on Kanchana 4 cast: రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించడంతో పాటు హీరోగా న‌టించిన హారర్ సినిమా ఫ్రాంఛైజీ 'కాంచ‌న'. హార‌ర్, కామెడీతో ప్రేక్షకులను భయపెట్టి, నవ్వించి భారీ విజయాలు అందుకున్నారు. 'కాంచ‌న' సూప‌ర్ హిట్ కావ‌డంతో దానికి కొన‌సాగింపుగా మ‌రో రెండు సినిమాలు తెర‌కెక్కించాడు లారెన్స్. అవి కూడా  ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు 'కాంచ‌న 4' ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిలోనూ రాఘవా లారెన్స్ హీరోగా నటించడంతో పాటు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌వికి సినిమా రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే... 'కాంచ‌న - 4' గురించి ఇప్పుడు ఒక అప్ డేట్ చక్కర్లు కొడుతోందట. ఆ వివరాల్లోకి వెళితే...

'కాంచన 4'లో మృణాల్ ఠాకూర్‌? 

'కాంచ‌న 4' సినిమాలో అందాల న‌టి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయికగా నటించనున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఓ వార్త‌ చ‌క్క‌ర్లు కొడుతోంది. 'సీతారామం', 'హాయ్ నాన్న‌', 'ఫ్యామిలీ స్టార్' లాంటి సినిమాలు చేసిన ఆమె త‌ర్వాత రాఘవా లారెన్స్ (Raghava Lawrence)తో క‌లిసి న‌టిస్తున్న‌ట్లు సదరు వార్త సారాంశం. ఈ మేర‌కు 'కాంచ‌న' టీమ్ ఆమెతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోందని చెప్పారు. అయితే... దీనిపై రాఘవా లారెన్స్ స్పందించారు. ఆ వార్తలో నిజం లేదని ఆయన ట్వీట్ చేశారు. ప్రచారంలో ఉన్న వార్తలు రూమర్స్ మాత్రమేనని, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తమ రాఘవేంద్ర ప్రోడిక్షన్స్ ఇస్తుందని ఆయన తెలిపారు. అదీ సంగతి! 

పిచ్చిఎక్కినా స‌రే.. 

‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హైద‌రాబాద్ వ‌చ్చిన లారెన్స్ 'కాంచ‌న - 4'పై ప్ర‌క‌ట‌న చేశారు. ముని సిరీస్ ఎప్పుడు రాబోతుంది అని అడిగిన ప్ర‌శ్నకి ఆయ‌న ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. హార‌ర్ సినిమాలు చేసి చేసి నాకు పిచ్చి ఎక్కుతుంది అంటూనే 'కాంచ‌న - 4' త్వ‌ర‌లోనే ప్రారంభింస్తాన‌ని చెప్పారు. పిచ్చెక్కినా స‌రే ఈ సారి పిచ్చిపిచ్చిగా సినిమా తీస్తాను అంటూ అంద‌రినీ న‌వ్వించారు లారెన్స్. 

ట్రెండ్ సెట్ట‌ర్.. 

ఇండ‌స్ట్రీలో ఎన్నో హార‌ర్ సినిమాలు వ‌చ్చాయి. అవన్నీ భ‌య‌పెట్టేవిగా ఉండేవి. కానీ, లారెన్స్ మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేశాడు అనే చెప్పాలి. హార‌ర్ కామెడీ అనే కొత్త జోన‌ర్ లో ఆయ‌న సినిమా తీసి స‌క్సెస్ అయ్యారు. భ‌య‌పెడుతూనే తెగ న‌వ్వించాడు లారెన్స్. ద‌య్యాలు అంటే భ‌యం ఉన్న‌వాళ్లు కూడా సినిమా చూసేలా చేశాడు. అలా కొత్త ట్రెండ్ సెట్ చేసి లారెన్స్.. దాన్ని కొన‌సాగిస్తూ మూడు భాగాలు తీసి సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు 'కాంచ‌న - 4' అంత‌కుమించి ఉంటుంద‌నే అంచ‌నాలు నెల‌కొన్నాయి ప్రేక్ష‌కుల్లో.

ఇక ప్ర‌స్తుతం రాఘ‌వ లారెన్స్, ఎజ్ జే సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా ‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’. కార్తీక్ సుబ్బ‌రాజ్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా దీపావ‌ళికి రిలీజ్ కానుంది. ఆ సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసింది టీమ్. దాంట్లో భాగంగా ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ప్రెస్ మీట్ కూడా నిర్వ‌హించారు. 

Also Read: శ్రీలీలకు సూపర్ ఛాన్స్ - బాలీవుడ్ డెబ్యూలో ఆ స్టార్ హీరో కొడుకుతో!?

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget