Radhika Apte: నీళ్లు లేవు, బాత్రూమ్‌కు వెళ్లే దారిలేదు - ఏరోబ్రిడ్జ్‌లో నటి రాధికా ఆప్టే లాక్, ఇండిగోపై ఆగ్రహం
Radhika Apte: తాజాగా హీరోయిన్ రాధికా ఆప్టే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్లి ఏరోబ్రిడ్జ్‌లో లాక్ అయిపోయింది. దానివల్ల ప్రయాణికులు ఎంత ఇబ్బందిపడ్డారో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Radhika Apte Instagram: కొన్ని ఎయిర్‌పోర్టులలో సెక్యూరిటీ చెక్, క్రూ అనేది వెంటనే ప్రయాణికులకు స్పందిస్తూ.. వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మ్యానేజ్‌మెంట్ తరపున కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. దాని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. తాజాగా హీరోయిన్ రాధికా ఆప్టే కూడా ఒక ఎయిర్‌పోర్టులో అలాంటి ఇబ్బందులనే ఎదుర్కుంది. దానికి తను సైలెంట్‌గా ఉండకుండా.. అసలు ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పోస్ట్‌కు క్యాప్షన్‌లో అసలు అక్కడ ఏం జరిగింది అని వివరించింది.
ఏం జరుగుతుందో ఐడియా లేదు
‘నేను ఇది పోస్ట్ చేయాల్సిందే. నాకు ఈరోజు ఉదయం 8.30కు ఫ్లైట్ ఉంది. ఇప్పుడు సమయం 10.50 అవుతోంది. ఫ్లైట్‌లోకి ఇంకా ప్రయాణికులను ఎక్కించలేదు. కానీ ఫ్లైట్ మాత్రం ప్రయాణికులు ఎక్కుతున్నారని ప్రకటించింది. నిజానికి ప్రయాణికులు అందరినీ ఏరోబ్రిడ్జ్‌లో పెట్టి లాక్ చేశారు. చిన్న పిల్లలతో ఉన్న ప్రయాణికులు, వృద్ధులు దాదాపు గంట నుండి ఇందులోనే లాక్ అయిపోయారు. సెక్యూరిటీ డోర్లను ఓపెన్ చేయదు. అసలు ఫ్లైట్ స్టాఫ్‌కు ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా ఐడియా లేదు. అసలు ముందుగా ఫ్లైట్ క్రూ కూడా విమానంలోకి బోర్డ్ అయినట్టుగా అనిపించడం లేదు’ అంటూ అసలు జరిగిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే.
తెలివితక్కువ స్టాఫ్..
‘ఫ్లైట్ క్రూలో మార్పులు జరగాల్సి ఉంది. కొత్త క్రూ డ్యూటీ ఎక్కాల్సి ఉంది. కానీ వారు ఎప్పుడు వస్తారు అనేది యాజమాన్యానికి అస్సలు ఐడియా లేదు. దీన్ని బట్టి చూస్తే అందరూ ఇక్కడే ఎంతసేపు లాక్ అయిపోయి ఉంటారో ఎవరికీ తెలియదు. నేను మెల్లగా తప్పించుకొని బయట ఉన్న ఒక స్టుపిడ్ స్టాఫ్ మహిళతో మాట్లాడాను. తను నాతో ఏ ఇబ్బంది లేదు, ఏ డిలే లేదు అని చెప్పింది. ఇప్పుడు నేను లోపల లాక్ అయిపోయి ఉన్నాను. కనీసం మధ్యాహ్నం 12 వరకు మేము ఇక్కడే ఉండాల్సి వస్తుందని అంటున్నారు. నీళ్లు లేవు, బాత్రూమ్‌కు వెళ్లే పరిస్థితి లేదు. ఈ ఫన్ రైడ్‌కు థ్యాంక్స్’ అని రాధికా పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ కింద కామెంట్స్ సెక్షన్‌లో చాలామంది నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అయ్యారు.
ప్రయాణికుల గొడవ..
తమకు కూడా పలు ఎయిర్‌పోర్టులలో పలుమార్లు ఇలా జరిగిందని సెలబ్రిటీలు సైతం చెప్పుకొచ్చారు. నెటిజన్లు కూడా తాము ఎదుర్కున్న ఇబ్బందులను బయటపెట్టారు. ముంబాయ్ ఎయిర్‌పోర్టులో చాలాసార్లు ఇలా జరిగిందని, ఇండిగో ఫ్లైట్ యాజమాన్యం ఇలాగే పనిచేస్తుందని చాలామంది విమర్శిస్తున్నారు. అసలు తను ఏ ఎయిర్‌పోర్టులో ఉందో, ఏ ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుందో రాధికా చెప్పకపోయినా.. నెటిజన్లే గెస్ చేస్తున్నారు. కొందరైతే ఆ ఎయిర్‌లైన్స్‌ను ట్యాగ్ చేయాల్సిందని, అప్పుడే వారికి బుద్ధి చెప్పినట్టు ఉండేదని సలహా ఇస్తున్నారు. ఓర్పు కోల్పోయిన కొందరు ప్రయాణికులు అక్కడి స్టాఫ్‌తో గొడవకు కూడా దిగారు.
View this post on Instagram