Trolls On Shah Rukh Khan: మహేష్ ఫ్యాన్స్‌కు షారుఖ్ షాక్ - రిలీజ్ తర్వాత ‘గుంటూరు కారం’ ట్రైలర్ షేర్ చేసిన బాద్‌షా, ఆడేసుకుంటున్న ట్రోలర్స్
Netizens Troll Shahrukh: బాలీవుడ్ 'బాద్‌షా' షారుక్ ఖాన్ ట్రోలర్ల చేతికి చిక్కాడు. స్వయంగా తప్పులో కాలేసి ట్రోల్స్ గురవుతున్నాడు.
Netizans Trolls Shah Rukh: బాలీవుడ్ 'బాద్‌షా' షారుక్ ఖాన్ ట్రోలర్ల చేతికి చిక్కాడు. స్వయంగా తప్పులో కాలేసి ట్రోల్స్ గురవుతున్నాడు. దీనికి కారణం తాజాగా ఆయన గుంటూరు కారం మూవీపై చేసిన ట్వీటే. ఏంటి సార్ ఇది చూసుకోవాలి కదా అంటూ నెటిజన్లు ఆయనను ట్రోల్స్ చేస్తూ ఆటాడేసుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం మూవీ జనవరి 12 విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అవ్వడం.. మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకోవడం అంతా అయిపోయింది. ఫస్ట్‌డే మంచి వసూళ్లు చేసిన ఈ మూవీ సెకండ్ డే కలెక్షన్లలో జోరు తగ్గిందంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇదిలా ఉంటే అల్రెడీ రిలీజైన మూవీ ట్రైలర్‌ను షేర్ చేస్తూ వేయిటింగ్ అంటూ షారుక్ ట్వీట్ చేయడం కోసమెరుపు. శనివారం (జనవరి 13న) షారుక్ గుంటూరు కారం ట్రైలర్‌ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు.
'అదేంటి.. చూసుకోవాలి కదా బాద్ షా..!'
అంతేకాదు దీనికి "గుంటూరు కారం మూవీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా.. ట్రైలర్ మొత్తం యాక్షన్, ఎమోషన్స్ సాగింది. అలాగే మాస్ నెక్ట్స్ లెవల్" అంటూ మహేష్‌ను ట్యాగ్ చేస్తూ ట్రైలర్‌పై రివ్యూ ఇచ్చాడు. ఇక ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు. స్టార్ హీరో అయిన షారుక్ ఇలా పోరపాటు చేయడమేంటని ఆయన తెలుగు అభిమానులు షాక్ అవుతుంటే.. ట్రోలర్స మాత్రం తమదైన స్టైల్లో షారుక్‌ను ఆడేసుకుంటున్నారు. ఏంటీ బాద్‌షా చూసుకోవాలి కదా.. అంటూ వెటకరిస్తున్నారు. 'ఇదేంటి కొత్త ట్రెండా..!! అల్రెడీ రిలీజ్ అయిన మూవీకి ప్రమోషన్సా' అని యూజర్ కామెంట్ చేయగా.. మరోకరు మీరు ఇప్పుడే మేలుకున్నారా? అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే 'అదేంటీ.. మూవీ రిలీజ్ అయ్యిందీగా.. ఇంకా మీరు ట్రైలర్ దగ్గరే ఉన్నారా?' అని షారుక్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాలుగా షారుక్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే షారుక్ ఈ ట్వీట్ గంటపైనే అవుతుంది. మరి దీనిపై షారుక్ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటాడో చూడాలి. అయితే ట్వీట్ మాత్రం ఇంకా డిలిట్ చేయలేదు.
Looking forward to #GunturKaaram my friend @urstrulyMahesh!!! A promising ride of action, emotion and of course…. Massss!!! Highly inflammable!https://t.co/a0zUlnA1iy
— Shah Rukh Khan (@iamsrk) January 13, 2024
ఇదిలా ఉంటే నిన్న రిలీజైన గుంటూరు కారం మూవీ సంక్రాంతి హిట్ కొడుతుందనుకుంటే.. మిక్స్‌డే టాక్‌కే పరిమితమైంది. ఈ సినిమాలో గురూజీ మ్యాజిక్ మిస్ అయ్యిందని, హోమ్లీ హీరో అయిన మహేష్ చేత మరి ఊరమాస్ డైలాగ్స్ చెప్పించడాన్ని ఫ్యామిలీ ఆడియన్స్‌తో జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు ఇతర ప్రైవేటు సాంగ్స్, సోషల్ మీడియా వైరల్ కంటెంట్‌ను వాడి సినిమాను నడిపించారంటున్నారు ఆడియన్స్. మహేష్ వంటి సూపర్ స్టార్ చేయాల్సిన సినిమా కాదంటున్నారు. మొత్తానికి 'గుంటూరు కారం' అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయినా.. మహేష్ మాస్ లుక్, క్యారెక్టరైజేషన్ మాత్రం కొత్తగా ఉందంటున్నారు. మొత్తానికి మిక్స్‌డ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో రూ. 80పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
Also Read: 'హనుమాన్'కు న్యాయం చేయాలి, నష్టాన్ని భరించాలి - ఎగ్జిబిటర్లకు TFPC లేఖ