అన్వేషించండి

Tollywood Upadates in May Month: బన్నీ, తారక్, ప్రభాస్ - మే నెలంతా అప్డేట్లే అప్డేట్లు, అభిమానులూ మీరు సిద్ధమేనా?

Tollywood Updates: మే నెలలో పెద్ద హీరోల సినిమాల సందడి లేకుండా పోయింది. అయితే సినీ అభిమానులకు కాస్త ఉపశమనం కలిగించడానికి పలు క్రేజీ చిత్రాల నుంచి అప్డేట్లు రాబోతున్నాయి.

Tollywood Updates: టాలీవుడ్ స్టార్ హీరోలు బిగ్ స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులైంది. 'గుంటూరు కారం' తర్వాత ఒక్క పెద్ద సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో సమ్మర్ సీజన్ లోనూ నిరాశే ఎదురైంది. మే 9న రిలీజ్ అవుతుందనుకున్న 'కల్కి 2898 AD' మూవీ కూడా వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు ఉపశమనం కలిగించడానికి స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల నుంచి వచ్చే నెలలో వరుసగా అప్డేట్లు రాబోతున్నాయి. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప: ది రూల్'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. 'పుష్ప: ది రైజ్' కు సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రంపై ట్రేడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. 

'పుష్ప 2' చిత్రం నుంచి 'పుష్ప పుష్పరాజ్' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను మే 1న కార్మికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా వదిలిన టైటిల్ సాంగ్ ప్రోమో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూర్చారు. బన్నీ - సుక్కూ - దేవిశ్రీలది సూపర్ హిట్ కాంబినేషన్. ఇప్పటి వరకూ వీరు ముగ్గురూ కలిసి చేసిన 'ఆర్య' 'ఆర్య 2' 'పుష్ప' మూవీ ఆల్బమ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు 'పుష్ప: ది రూల్' సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయనేది మొదటి లిరికల్ తో తెలిసిపోతుంది. ఆగస్టు 15న ఈ పాన్ ఇండియా యాక్షన్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. 

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెడుతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్, ఇతర స్పెషల్ పోస్టర్స్ కు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. మే నెలలో తారక్ బర్త్ డే స్పెషల్ గా ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

'దేవర' సినిమాకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మే 20వ తేదీన ఫస్ట్ సింగిల్ లేదా టీజర్ ను రిలీజ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అలానే నందమూరి హీరో బాలీవుడ్ డెబ్యూ అప్డేట్ కూడా అదే రోజున రావొచ్చని అంటున్నారు. తారక్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' అనే హిందీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దీనికి దర్శకుడు. యంగ్ టైగర్ బర్త్ డేకి ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి, స్పెషల్ పోస్టర్ రిలీజ్ చెయ్యొచ్చని వార్తలు వస్తున్నాయి. 

మే నెలలోనే 'కల్కి 2898 AD' మూవీ ప్రమోషన్స్ షురూ చేయనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. దాదాపు పూర్తయిన ఈ పాన్ ఇండియా సినిమా విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా వచ్చే నెలాఖరున ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్నారు. 

వీటితో పాటు మరికొన్ని సినిమాల అప్డేట్లు ఈ నెలలోనే రాబోతున్నాయి. పూరీ జగన్నాథ్ - ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీ టీజర్ లేదా ఫస్ట్ సాంగ్ ను మే 15న విడుదల చేస్తారని టాక్. అలానే విశ్వనటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'భారతీయుడు 2' మూవీ నుంచి మొదటి పాటను వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: 'ఆ ఒక్కటీ అడక్కు'... నవ్వులు పూయిస్తున్న అల్లరోడి పెళ్లి కష్టాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Embed widget