Deepika Padukone : మంగళవారం హైదరాబాద్‌లో దిగిన దీపికా పదుకోన్ - ఎందుకంటే?
Project K Update: భారతీయ కథానాయిక, గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకోన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆవిడ ఎందుకు వచ్చారు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
ఇప్పుడు గ్లోబల్ ఐకాన్, ఇండియన్ హీరోయిన్ దీపికా పదుకోన్ (Deepika Padukone) హైదరాబాద్ సిటీలో ఉన్నారు. ముంబై నుంచి మంగళవారం భాగ్య నగరానికి వచ్చారు. ఆవిడ ఎందుకు వచ్చారు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' కోసం!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా (Project K Movie). 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా దీపికా పదుకోన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ కోసమే ఆమె హైదరాబాద్ వచ్చారని తెలిసింది.
వారమే 'ప్రాజెక్ట్ కె' నయా షెడ్యూల్!
ప్రస్తుతం జరుగుతున్న 'ప్రాజెక్ట్ కె' హైదరాబాద్ షెడ్యూల్ మరో వారం రోజుల్లో ముగుస్తుందని తెలిసింది. ఎందుకంటే... ఆ తర్వాత యూనిట్ అందరూ అమెరికా వెళ్లనున్నారు.
జూలై 19 నుంచి అమెరికాలోని శాన్ డియాగోలో జరిగే కామిక్ కాన్ వేడుకల్లో 'ప్రాజెక్ట్ కె' టైటిల్, ఇంకా గ్లింప్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. జూలై 20న టైటిల్ ఏమిటో వెల్లడించనున్నారు. ఆ కార్యక్రమం కోసం ప్రభాస్, దీపికా పదుకోన్ సహా చిత్ర బృందంలో కీలక సభ్యులు పాల్గొంటారు. అందుకోసమే ఈ షెడ్యూల్ వారంలో ఎండ్ చేయనున్నారు. ఆల్రెడీ 'ప్రాజెక్ట్ కె' టీ షర్టులు అందుబాటులోకి వచ్చాయి. వాటితో అమితాబ్, ఇంకా అభిమానులు హల్ చల్ చేస్తున్నారు.
Also Read : వినాయక చవితికి విశాల్ 'మార్క్ ఆంటోనీ' - ఇది టైమ్ ట్రావెల్ యాక్షన్ గురూ!
'ప్రాజెక్ట్ కె'లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్స్‌లో ఒకరైన అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఇటీవల లోక నాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read : బాలకృష్ణ అభిమాని... కలకత్తా వెళ్లి మరీ మార్టినెజ్‌తో ఫోటో, ఎవరీ మార్టినెజ్?
'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ (Prabhas)కు ధీటైన ప్రతినాయకుడిగా కమల్ హాసన్ (Kamal Haasan) నటించనున్నారని కొన్ని రోజులుగా వినపడుతోంది. విలన్ అని చిత్ర బృందం చెప్పలేదు గానీ సినిమాలో కమల్ ఉన్నారని కన్ఫర్మ్ చేసింది. దాంతో ఆయన పాత్ర ఎలా ఉంటుంది? ప్రభాస్, కమల్ మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి? అని ప్రేక్షకులు ఆలోచించడం మొదలు పెట్టారు.
ఈ సినిమాలో దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న సినిమా విడుదల చేయాలనేది ప్రస్తుతానికి ఉన్న ప్లాన్. అయితే... సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం కష్టమని, 2024 వేసవికి వస్తుందని ఆ మధ్య ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.
కమల్ రెమ్యూనరేషన్ 150 కోట్లు?
'ప్రాజెక్ట్ కె'లో ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నందుకు కమల్ హాసన్ (Kamal Haasan Remuneration Project K)కు భారీ పారితోషికం ఇస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆయనకు 150 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. 'విక్రమ్' విజయంతో కమల్ హాసన్ పూర్వ వైభవం అందుకున్నారు. వందల కోట్లు వసూలు చేయగల స్టార్లలో ఆయన కూడా ఒకరని, ఆ ఇమేజ్ చెక్కు చెదరలేదని 'విక్రమ్' ప్రూవ్ చేసింది. అందువల్ల, అన్ని కోట్లు ఆఫర్ చేశారని సమాచారం.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial