News
News
X

Project K Release Date: సంక్రాంతి ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' - విడుదల ఎప్పుడంటే?

Prabhas Deepika Padukone Movie Update : ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తున్న సినిమా 'ప్రాజెక్ట్ కె'. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని నేడు అధికారికంగా వెల్లడించారు. 

FOLLOW US: 
Share:

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు సూపర్ డూపర్ గుడ్ న్యూస్. ఈ ఏడాది సంక్రాంతికి ఆయన సినిమా రాలేదని కొందరు ఫీల్ అయ్యారు. అయితే, వచ్చే ఏడాది సంక్రాంతికి ఆయన మాంచి ధమాకా రెడీ చేశారు. 'ప్రాజెక్ట్ కె'ను పెద్ద పండక్కి రెడీ చేస్తున్నట్లు తెలిపారు. 

జనవరి 12న 'ప్రాజెక్ట్ కె' విడుదల
Project K Release On Sankranti 2024: జనవరి 12, 2024లో 'ప్రాజెక్ట్ కె'ను విడుదల చేయనున్నట్లు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు అనౌన్స్ చేశారు. ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో పెద్ద చెయ్యి... దాని ముందు గన్స్ పట్టుకున్న ముగ్గురు వ్యక్తుల్ని కూడా చూపించారు. 

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ (Deepika Padukone) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'సీతా రామం' సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్మాత అశ్వినీదత్... 'ప్రాజెక్ట్ కె' విడుదల తేదీ గురించి హింట్ ఇచ్చారు. 

అక్టోబర్ 18, 2023న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు 'సీతా రామం' విడుదల సమయంలో అశ్వినీదత్ చెప్పారు. ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయలేని పక్షంలో 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 

హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెరపై రానటువంటి కథాంశంతో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కుతోందని టాక్. 

'ప్రాజెక్ట్ కె' కంటే ముందు మరో రెండు!
'ప్రాజెక్ట్ కె' కంటే ముందు ప్రభాస్ నటించిన మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రభు శ్రీరామ్ పాత్రలో ప్రభాస్ నటించిన సినిమా 'ఆదిపురుష్'. తొలుత గత ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలనుకున్నా... ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కోసం వాయిదా వేశారు. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే, టీజర్ విడుదలైన తర్వాత వీఎఫ్ఎక్స్ వర్క్ మీద ట్రోల్స్ రావడంతో మళ్ళీ వాయిదా వేశారు. విజువల్ ఎఫెక్ట్స్ మీద రీ వర్క్ చేస్తున్నారు.  

Also Read : 'శ్రీదేవి శోభన్ బాబు' రివ్యూ : చిరంజీవి కుమార్తె నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

ఫైనల్ రిలీజ్ డేట్ ఏంటంటే... జూన్ 16న! ఆ రోజు  'ఆదిపురుష్'ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. వెనక్కి వెళ్ళేది లేదని కూడా యూనిట్ చెప్పారు. సో... ఈ ఏడాది ఫస్ట్ 'ఆదిపురుష్'తో ప్రభాస్ థియేటర్లలోకి వస్తారు. ఆ తర్వాత 'సలార్' విడుదల కానుంది.

సెప్టెంబర్ 28న 'సలార్'
జూన్ 16న 'ఆదిపురుష్' విడుదల అవుతుంది కాబట్టి 'సలార్' వాయిదా పడే ఛాన్స్ ఉందని కొందరు అనుకున్నారు. అయితే, హోంబలే ఫిలిమ్స్ సంస్థ సెప్టెంబర్ 28న ఆ సినిమాను విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. దాంతో ఆ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా సంక్రాంతికి వస్తుందని వినిపించింది. 'ప్రాజెక్ట్ కె' సంక్రాంతికి కన్ఫర్మ్ కావడంతో ఆ సినిమా వెనక్కి వెళ్లినట్లు!

Also Read 'వినరో భాగ్యము విష్ణు కథ' రివ్యూ : కిరణ్ అబ్బవరానికి హిట్ వచ్చిందా? లేదా? 

Published at : 18 Feb 2023 01:08 PM (IST) Tags: deepika padukone Amitabh bachchan Prabhas Project K Release Date Project K On Jan 12

సంబంధిత కథనాలు

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204