Naga Vamsi: బాలయ్య నోట తారక్ మాట... 'అన్‌స్టాపబుల్ 4' ఆఫ్ ది రికార్డ్ స్టోరీ బయట పెట్టిన నిర్మాత నాగవంశీ
Producer Naga Vamsi : 'అన్ స్టాపబుల్ 4' షోలో రీసెంట్ గా 'డాకు మహారాజ్' టీమ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఎన్టీఆర్ షాట్ ను కట్ చేశారనే వివాదంపై నాగవంశీ స్పందించారు.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్' మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ట్రోలింగ్, నెగిటివ్ ప్రచారం మొదలైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది ఈ మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా 'అన్ స్టాపబుల్' షోలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావన రాగా, కట్ చేశారనేది ఈ ట్రోలింగ్ కు ముఖ్య కారణం. తాజాగా ఈ విషయంపై నిర్మాత సూర్యదేవర నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.
వివాదం ఏంటంటే?
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న బాలయ్య 'డాకు మహరాజ్' సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా సెలబ్రిటీ టాక్ షో 'అన్ స్టాపబుల్ -4' షోకి 'డాకూ మహారాజ్' టీం రీసెంట్ గా అటెండ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేదికపై చోటు చేసుకున్న సంఘటన వివాదానికి ఆజ్యం పోసినట్టుగా అయింది. రీసెంట్ గా 'అన్ స్టాటబుల్' షోకి 'డాకు మహారాజ్' డైరెక్టర్ బాబి, నిర్మాత నాగ వంశీతో పాటు బాలయ్య కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే.
షోలో భాగంగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాల గురించి ఇందులో ప్రస్తావన రాగా... పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీ మామ, వాల్తేర్ వీరయ్య సినిమా పోస్టర్లను ప్రదర్శించారు. అయితే బాబీ కెరీర్ కి కీలకంగా మారిన 'జై లవకుశ' సినిమాని మాత్రం వదిలేశారు. అది కూడా ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో వివాదం మొదలైంది. షోలో ఎన్టీఆర్ గురించి మాట్లాడిన షాట్ ని కావాలనే తీసేశారు అంటూ 'డాకు మహారాజ్' సినిమాపై, అలాగే అన్ స్టాపబుల్' మేకర్స్ పై మండిపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. నిజానికి బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఎంతవరకు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి ? అనే విషయంపై పెద్దగా ఎవ్వరికీ క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాలకృష్ణ వర్సెస్ ఎన్టీఆర్ అంటూ ఇరువురి హీరోల అభిమానులు తెగ కొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ, అసలు విషయాన్ని వెల్లడించారు.
బాలయ్య నోట ఎన్టీఆర్ మాట...
తాజాగా నాగ వంశీ మాట్లాడుతూ షోలో అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కానీ లేదా జై లవకుశ ప్రస్తావనే రాలేదని అన్నారు. అసలు ప్రస్తావనే లేనప్పుడు, దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటూ తిరిగి ప్రశ్నించారు నాగ వంశీ. అయితే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం బాలయ్య ఏదో ఒక పాత సినిమాను ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందని అన్నట్టుగా నాగవంశీ చెప్పడం గమనార్హం. సినిమా రిలీజ్ కి ముందు ఇలా వివాదం బాధ కలిగిస్తుందని అన్నారు ఆయన. నాగవంశీ మాట్లాడుతూ "నేను తారక్ సినిమాలు, అలాగే బాలయ్య సినిమాలు కూడా చూస్తాను. రేపు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే ఆయన సినిమాల కోసం కూడా ఎదురు చూస్తాను. కానీ ఇలాంటి వివాదాలు రావడం మాత్రం కరెక్ట్ కాదు" అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక రీసెంట్ గా నాగవంశీ "ఇది మన అందరి సినిమా. అందరం కలిసి హిట్ చేద్దాం" అంటూ ఎన్టీఆర్ అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశారు.