Game Changer Update: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ - ‘లవ్ మీ’ వేదికగా 'గేమ్ ఛేంజర్' అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు!
Game Changer Update: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్'. చెర్రీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు.
![Game Changer Update: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ - ‘లవ్ మీ’ వేదికగా 'గేమ్ ఛేంజర్' అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు! Producer Dil Raju reveals that update coming from Game Changer on the occasion of Ram Charan birthday Game Changer Update: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ - ‘లవ్ మీ’ వేదికగా 'గేమ్ ఛేంజర్' అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/2514c34c5647432c11232947824c08f51709822309608686_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Game Changer Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చెర్రీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏడాది కాలంగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఏమీ లేకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వారిని ఉత్సాహపరిచే ఓ అప్డేట్ అందించారు నిర్మాత దిల్ రాజు.
‘లవ్ మీ’ టీజర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ''ఈ నెలలో మన రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఆ రోజు మీకోసం 'గేమ్ ఛేంజర్' నుంచి కంటెంట్ రాబోతోంది'' అని చెప్పారు. దీంతో చాలా కాలంగా తమ అభిమాన హీరో సినిమా అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్న ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. ఎట్టకేలకు మార్చి 27న ఏదొక అప్డేట్ రాబోతోందని సంబరపడిపోతున్నారు. ఎలాంటి కంటెంట్ ను రిలీజ్ చేస్తారా అని ఆలోచిస్తున్నారు.
నిజానికి చెర్రీ బర్త్ డే స్పెషల్ గా 'గేమ్ ఛేంజర్' అప్డేట్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడిదే విషయాన్ని దిల్ రాజు కన్‌ఫర్మ్ చేశారు. కాకపోతే 'జరగండి' అనే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. గతేడాదే లీకైన ఈ సాంగ్ ను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇంతవరకూ ఆ పాట బయటకు రాలేదు. ఇదే పాటను రామ్ చరణ్ పుట్టినరోజుకు వదిలే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఓ స్పెషల్ పోస్టర్ కూడా వస్తుందని, రిలీజ్ డేట్ కు అనౌన్స్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ తండ్రీకొడులుగా రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చరణ్ ఒక పొలిటికల్ లీడర్ కనిపిస్తారని తెలుస్తోంది. ఇందులో ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్, సునీల్, జయరామ్, సముద్రఖని, నవీన్ చంద్ర, సముద్ర ఖని, నాజర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.
Also Read: లేచింది మహిళా లోకం - పవర్ ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్స్‌తో వచ్చిన లేటెస్ట్ సినిమాలివే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)