Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
Priyanka Chopra : మహేశ్ బాబు, రాజమౌళి కాంబో విజువల్ వండర్ వారణాసి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరోయిన్ ప్రియాంక చోప్రా. తాను 14 నెలలుగా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు చెప్పారు.

Priyanka Chopra Reaction Over Rajamouli Varanasi Shooting : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ వారణాసి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆమె లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో ఆమె వారణాసి గురించి మాట్లాడారు.
'స్లో మోషన్ జంప్ చేశాను'
తాను 14 నెలలుగా ఈ భారీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నట్లు చెప్పారు ప్రియాంక చోప్రా. 'సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి చాలా టైం తీసుకుంటారనే సంగతి మనందరికీ తెలిసిందే. నేను 14 నెలలుగా ఈ సినిమా కోసం పని చేస్తున్నాను. ప్రతీ సీన్‌ను రాజమౌళి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నేను అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చాలా చేశాను. ప్రస్తుతానికి నేను ఇంత కంటే ఎక్కువ చెప్పలేను. ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఇదే వెరీ డిఫరెంట్.' అని అన్నారు.
బర్త్ డే సర్ప్రైజ్ ఉంటుందా?
ఇప్పటివరకూ టైటిల్ గ్లింప్స్ తప్ప వారణాసి నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కనీసం టీజర్ కానీ లుక్స్ కానీ ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా వారణాసి నుంచి బిగ్ ట్రీట్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే మ్యాగ్జిమమ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాగా... ఆగస్ట్ 9న మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మరి రాజమౌళి అండ్ టీం ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.
అప్పుడే షూటింగ్ పూర్తి
ఇటీవల ఫ్రాన్స్ పర్యటనలో రాజమౌళి వారణాసి స్టోరీతో పాటు మూవీ షూటింగ్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. వారణాసికి సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తైందని... కనెక్టింగ్ లింక్స్ సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలిపారు జక్కన్న. సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో షూటింగ్ పూర్తవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత VFX, గ్రాఫిక్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రమోషన్స్‌పై ప్లాన్ చేయనున్నట్లు సమాచారం.
తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషన్ వారణాసి కథకు మూలం అని బిగ్ రివీల్ చేశారు జక్కన్న. ఆఫ్రికా దట్టమైన అడవులు, అంటార్కిటికా చలి, రామాయణంలో దేవుళ్లు, ప్రకృతి విపత్తులు వంటి భారీ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పారు. రామాయణంలో శ్రీరాముడు, కుంభకర్ణుడి మధ్య వార్ సీన్ మూవీకే హైలెట్ అని అన్నారు. సినిమాలో మహేశ్ శ్రీరాముడు, రుద్రుడిగా కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, విలన్ రణ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రెండింగ్ వార్తలు























