By: ABP Desam | Updated at : 13 May 2023 11:13 AM (IST)
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రియాంకా చోప్రా... నిశ్చితార్థం కోసం ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళినప్పుడు పరిణీతి - రాఘవ్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, యువ రాజకీయ నేత రాఘవ్ చద్ధాల నిశ్చితార్థ వేడుక కోసం నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఢిల్లీ చేరుకున్నారు. అభిమానులు, ఫొటోగ్రాఫర్స్ ఆమెకు ఘన స్వాగతం పలకగా... అనంతరం కారులో అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ సమయంలో ప్రియాంక లేత గోధుమరంగు స్వెట్‌షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్‌లను ధరించింది. తలపై నల్లటి టోపీ, మ్యాచింగ్ షూస్, డార్క్ సన్ గ్లాసెస్ కూడా ధరించింది. భుజానికి నల్ల బ్యాగ్ వేసుకుని.. కారు వైపు వెళుతుండగా, ఆమె ఒక చిరునవ్వు నవ్వి... ఫొటోగ్రాఫర్లకు రెండు చేతులు జోడించి నమస్కరించింది. దాంతో పాటు ఆమె తల ఊపుతూ 'నమస్తే (హిందీలో హలో)' అని చెప్పి కారులో బయలుదేరింది.
అంతకుముందు, ప్రియాంక లండన్ విమానాశ్రయంలో అభిమానులకు పోజులిచ్చిన పలు ఫొటోలు దిగింది. ఇవి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రియాంక మే 13న ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో పరిణీతి చోప్రా, రాఘవల నిశ్చితార్థానికి హాజరుకానున్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక ఏర్పాట్లకు సంబంధించి పలు ఫొటోలు బయటికొచ్చాయి. వీటిల్లో రాఘవ్ చద్దా ఇంటిని పువ్వులు, లైట్లతో అలంకరించారు. అంతకుముందు ముంబైలోని పరిణీతి ఇంటిని కూడా లైట్లతో అలంకరించారు.
పరిణీతి చోప్రా రాఘవ్ చద్ధాల నిశ్చితార్థ వేడుక మే 13న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవనున్నట్టు తెలుస్తోంది. సిక్కు ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఆర్దాస్ తర్వాత సుఖ్మణి సాహిబ్ తో ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఈ వేడుకలో ప్రియాంకతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొననున్నట్టు సమాచారం.
Also Read : సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న నజ్రియా - షాకింగ్ డెసిషన్
మార్చిలో ముంబైలో లంచ్ డేట్‌లో కలిసి కనిపించిన నుంచి పరిణీతి- రాఘవపై పుకార్లు మొదలయ్యాయి. అప్పటి నుంచి వారు చాలా సందర్భాలలో కలిసి కనిపించారు. ఈ పుకార్ల గురించి ఫొటోగ్రాఫర్లు వారిని అడిగినప్పుడు పరిణీతి గానీ, రాఘవ్ గానీ వాటిని ధృవీకరించలేదు, ఖండించలేదు. అయితే, చాలా సార్లు పరిణీతి నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపించడం మాత్రం ఈ పుకార్లకు మరింత బలాన్నిచ్చింది. పరిణీతి - రాఘవ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలిసి చదువుకున్నారని, వారు చాలా కాలం నుంచే స్నేహితులు అని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఇక పరిణీతి సినిమా విషయాలకొస్తే.. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన చమ్కిలాలో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి పరిణీతి కనిపించనుంది. ఈ చిత్రం ఇద్దరు ప్రసిద్ధ పంజాబీ గాయకులు అమర్‌జోత్ కౌర్, అమర్ సింగ్ చమ్కిలా చుట్టూ తిరుగుతుంది. ఇదిలా ఉండగా ప్రియాంక చివరి సారిగా సామ్ హ్యూగన్‌తో కలిసి లవ్ ఎగైన్ చిత్రంలో కనిపించింది. ఆమె ప్రస్తుతం సిటాడెల్‌లో రిచర్డ్ మాడెన్‌తో కలిసి నటిస్తోంది. ది రస్సో బ్రదర్స్ రూపొందించిన, యాక్షన్-ప్యాక్డ్ షో గ్లోబల్ గూఢచారి సంస్థ సిటాడెల్‌కు చెందిన ఇద్దరు ఎలైట్ ఏజెంట్లు మాసన్ కేన్ (రిచర్డ్), నదియా సిన్హ్ (ప్రియాంక) చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
Also Read : కంగనా రనౌత్, అలియా భట్ ను వెనక్కి నెట్టిన ఆదా శర్మ, బాక్సాఫీస్ దగ్గర ‘ది కేరళ స్టోరీ’ సరికొత్త రికార్డు!
Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?
Korean Thrillers: ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో మరిచిపోలేరు - ఓ లుక్ వేసేయండి
Nawazuddin Siddiqui: లీడ్ యాక్టర్స్‌తో కలిసి తింటుంటే, కాలర్ పట్టుకొని బయటకు లాక్కెళ్లారు - నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?